అనారోగ్యంతో బాధపడుతున్న ప్రభాస్ కోసం అనుష్క ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
ఈ మధ్యకాలంలో చాలామంది సినీ సెలబ్రిటీలు ఒక్కరి తర్వాత ఒకరు అనారోగ్యానికి గురవుతూ బాధపడుతున్నారు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో మరియు హీరోయిన్లుగా కొనసాగుతున్న చాలామంది తమ అనారోగ్యం కారణంగా తమ సినిమాలకు సంబంధించిన షూటింగ్లకు కూడా బ్రేక్ వేస్తున్నారు.అయితే తాజాగా ఇప్పుడు అదే లిస్టులోకి చేరాడు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్.ఫ్యాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ని సంపాదించుకున్న ప్రభాస్ ఇప్పుడు అనారోగ్యం కారణంగా తన సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ అన్నిటికీ కూడా బ్రేక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న సలార్, నాగశ్వీన్ దర్శకత్వంలో రానున్న ప్రాజెక్టుకే వీటితోపాటు మారుతి డైరెక్షన్లో రానున్న రాజా డీలక్స్ ఇలా వరుసగా ముడు సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాల షూటింగ్ పనిలో పడి అలసిపోయినట్లుగా సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ వరుసగా మూడు సినిమాల షూటింగ్స్ కు వెంట వెంటనే హాజరవ్వడమే దీనికి ముఖ్య కారణం అని అంటున్నారు. అయితే ఈ క్రమంలోనే ప్రభాస్ తల్లి తన ఆరోగ్యం పై దృష్టి పెట్టమని ప్రభాస్కు చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది.

అయితే ఈ క్రమంలోని ప్రభాస్ గర్ల్ ఫ్రెండ్ గా అందరూ భావిస్తున్న అనుష్క ప్రభాస్ ఆరోగ్యం బాగుండాలి అంటూ ఇంట్లోనే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తోందని అంటున్నారు. ఇక ఈ విషయం వారి కామన్ ఫ్రెండ్ ద్వారా బయటికి రావడం జరిగింది. దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అంతేకాదు ప్రభాస్ ఆరోగ్యం కోసం అనుష్క ఉపవాసం కూడా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఎదేమైనప్పటికీ వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఉందని బయట పెట్టకపోయినప్పటికీ అనుష్క ప్రభాస్ గురించి ఇలా చేయడంతో వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని మరోసారి బయటపడింది. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే ఇంకా బాగుంటుందని ఈ వార్త విన్న చాలా మంది తమ అభిమానులు తమ అభిప్రాయాలని వ్యక్తపరుస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: