సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన రామ్ చరణ్.. ఏంటో తెలుసా..!?

Anilkumar
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ ని పొందాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక ఆ సినిమాలో ఆయన పోషించిన సీతారామరాజు పాత్రకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించడం జరిగింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మంచి విజయాన్ని అందుకోవడంతో రామ్ చరణ్ రేంజ్ మరింత పెరిగిపోయింది. బయటనే కాకుండా సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ దక్కింది. అయితే రామ్ చరణ్ ఎప్పుడూ లేనివిధంగా ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు. 

అంతేకాదు తన భార్య ఉపాసనతో కలిసి దిగిన కొన్ని ఫోటోలు మరియు ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్స్ వెకేషన్ కి వెళ్ళిన ఫోటోలు వాటితో పాటు తన సినిమాలకు సంబంధించిన అప్డేట్లను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ .అయితే దీంతో తన ఇన్స్టాగ్రామ్ లో అతనిని అనుసరించే వారి సంఖ్య ఇప్పుడు అమాంతంగా పెరిగిపోయింది. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంస్టాగ్రామ్ ఫాలోయర్ల సంఖ్య 12 మిలియన్లకు చేరింది.చాలా తక్కువ సమయంలోనే 12 మిలియన్ల ఫాలోవర్లని సొంతం చేసుకున్నాడు రామ్ చరణ్ .

దీంతో ఒకసారి కొత్త రికార్డును నెలకొల్పాడు అని చెప్పాలి. ఒక స్టార్ హీరోకి 12 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు అంటే అది మామూలు విషయం కాదు. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఈ సంఖ్య దాటిన హీరోలు ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఒకటి ఐకాన్స్టర్ అల్లు అర్జున్ ప్రస్తుతం 19.9 మిలియన్ల ఫాలోవర్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. దాని అనంతరం 17.8 మిలియన్ల ఫాలోవర్లతో విజయ్ దేవరకొండ రెండవ స్థానంలో ఉన్నాడు. తాజాగా ఇప్పుడు 12 మిలియన్లు ఫాలోయర్లతో రామ్ చరణ్ మూడో స్థానంలో ఉన్నాడు. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ అయిన శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆర్సి15 పేరుతో ఈ సినిమా రానుంది. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: