"భోళా శంకర్" మూవీ నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మూవీ యూనిట్..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కుర్ర హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా వరుస మూవీ లలో నటిస్తూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా పోయిన సంవత్సరం చిరంజీవి ఏకంగా రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. అలాగే ఈ సంవత్సరం ప్రారంభం లోనే చిరంజీవి సంక్రాంతి కానుకగా విడుదల అయిన వాల్టేరు వీరయ్య మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

ప్రస్తుతం కూడా ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను ప్రపంచవ్యాప్తంగా రాబడుతుంది. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. మైత్రి సంస్థ నిర్మించిన ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా , మాస్ మహారాజా రవితేజ ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్నటువంటి భోళా శంకర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. మిల్కీ బ్యూటీ తమన్నా  ఈ మూవీ లో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తోంది. చెల్లెలు సెంటిమెంట్ తో రూపొందుతున్న ఈ మూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది.

ఈ మూవీ తమిళం లో సూపర్ హిట్ అయినటు వంటి వేదలం మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా షూటింగ్ గురించి తాజాగా ఒక అప్డేట్ ఇచ్చింది. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక అదిరిపోయే సాంగ్ ను షూట్ చేసినట్లు ... ఆ పాటకు శేఖర్ మాస్టర్ కరేయగ్రపి చేసినట్లు ఈ మూవీ యూనిట్ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: