ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన కళ్యాణ్ రామ్.. 'బింబిసార' సీక్వెల్ ఎప్పుడంటే..?

Anilkumar
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఇటీవల నటించిన 'బింబిసార' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కళ్యాణ్ రామ్ డ్యూయల్ రోల్ లో నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూలను కొల్లగొట్టింది. ఈ సినిమాతో వశిష్ట వెండితెరకు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని మూవీ టీం ఇప్పటికే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి తాజాగా గుడ్ న్యూస్ చెప్పాడు కళ్యాణ్ రామ్. ఇక బింబిసార తో మంచి సక్సెస్ అందుకున్న కళ్యాణ్ రామ్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. 

కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ 'అమిగోస్'.ఇప్పటికే షూటింగ్ పూర్తి పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 10 న విడుదల కాబోతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసిన కళ్యాణ్ రామ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ డెవిల్ షూటింగ్లో పాల్గొంటున్నాడు. అయితే తాజాగా అమిగోస్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బింబిసారా సీక్వెల్ గురించి కళ్యాణ్ రామ్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం డెవిల్ సినిమా షూటింగ్ దాదాపు 70% పూర్తయిందని.. ఇక బింబిసారా సీక్వెల్ ని ఈ ఏడాది చివరి కల్లా సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామంటూ.. కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు. ఇక ఈ అప్డేట్ తో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

ఎందుకంటే ఇప్పటివరకు కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే బింబి సార సినిమా అతిపెద్ద విజయాన్ని అందుకుంది. అందుకే ఈ సీక్వెల్ కోసం ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న అమిగోస్ సినిమాలో కళ్యాణ్ రామ్ ఏకంగా మూడు విభిన్న తరహా పాత్రలో నటించాడు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకి రాజేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్, ట్రైలర్ కి ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ లభించింది. ఖచ్చితంగా ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని మేకర్స్ ఈ సినిమాపై ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి 'బింబిసార' తో బ్లాక్ బస్టర్ అందుకున్న కళ్యాణ్ రామ్ 'అమిగోస్' తో హిట్ ట్రాక్ ని కంటిన్యూ  చేస్తాడా లేదా అనేది చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: