శ్రీను వైట్ల కెరీర్ నాశనం కావడానికి ఆ స్టార్ డైరెక్టరే కారణమా..!?

Anilkumar
కామెడీ సినిమాలు తీయడంలో జంధ్యాల గారు ఒక చెరగని ముద్ర వేశారు. ఆయన సినిమాలు చూసినంత సేపు తమ తమ జీవితాల్లో ఉన్న కష్టాలన్నీ మర్చిపోయి మనస్పూర్తిగా ఆయన సినిమాలను చూస్తూ నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక ఆయన తర్వాత అంతటి హాస్యాన్ని పండించిన దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అదే నేటితరం శ్రీను వైట్ల మాత్రమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈయన తీసిన ప్రతి సినిమా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే విధంగా ఆయన సినిమాలు ఉంటాయి. సొంతం, వెంకీ, దుబాయ్ శ్రీను,కింగ్,రెడీ, దూకుడు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ఉన్నాయి. 

ఇలాంటి ఎన్నో ఆణిముత్యాలు సినిమాలను తెరకెక్కించాడు ఆయన. అయితే ఇప్పటి సినిమాల్లో కూడా ఆయన తీసిన సినిమాలోని సన్నివేశాలను మేకర్స్ కామెడీ కోసం ఇప్పటి సినిమాలలో వాడుతూ ఉంటారు. గతంలో వరస సినిమాలు చేసిన శ్రీను వైట్లకి ప్రస్తుతం అవకాశాలు లేక ఖాళీగా ఇంట్లోనే కూర్చుంటున్నాడు. దూకుడు సినిమా అనంతరం ఆయన తీసిన బాద్షా సినిమా ఒక్కటే కమర్షియల్ గా మంచి హిట్ను అందుకుంది. దాని అనంతరం వచ్చిన ఆగడు బ్రూస్లీ మిస్టర్ అమర్ అక్బర్ అంటోనీ వంటి సినిమాలో డిజాస్టర్ గా మిగిలాయి. దీంతో శ్రీను వైట్ల కెరియర్ ఎండ్ అయింది అని అందరూ భావించారు.

అయితే ఈయన కెరియర్ ఇప్పుడు ఇలా అయిపోవడానికి కారణం ఒకప్పుడు తనతో ఉన్న టీం ఇప్పుడు లేకపోవడమే అని తెలుస్తోంది. కోన వెంకట్ గోపి మోహన్ లో శ్రీను వైట్ల నుండి కొన్ని గొడవల కారణంగా వీరు ముగ్గురు విడిపోయారు. దాని అనంతరం శ్రీను వైట్ల దగ్గర మొదటి నుండి ఆయన రైటింగ్ టీంలో ఉంటూ వస్తున్నాను అనిల్ రావిపూడి కూడా ఆయన దగ్గర నుండి బయటకు వచ్చేసి ప్రస్తుతం పెద్ద డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. అయితే ఇలా మొదటి నుండి శ్రీను వైట్ల దగ్గర ఆయూ పట్టు లాగా ఉన్న చాలామంది ఒక్కొక్కరిగా బయటకి రావడం ఆయనతో విడిపోవడంతో ఆయన కెరియర్ ఇప్పుడు ముగిసింది అని చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: