టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న ప్రియాంక చోప్రా.. ఏకంగా స్టార్ హీరోకి జోడిగా..?

Anilkumar
ఇండియా నుంచి హాలీవుడ్ చేరి గ్లోబల్ స్టార్ డం ని సొంతం చేసుకున్న ప్రియాంక చోప్రా గురించి పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ లో స్టార్ గా వెలిగిన ఈమె గత కొన్నారుగా బాలీవుడ్ ను వదిలేసింది. సాధారణంగా బాలీవుడ్లో చాలామంది వారసత్వంగా వచ్చి హీరో హీరోయిన్లుగా ఉన్నవారే. కానీ ఎటువంటి ఫిలిం బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా ఎదిగింది ప్రియాంక చోప్రా. అయితే ఈమె గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంది. హిందీ సినిమాలలో అప్పుడప్పుడు కనిపిస్తోంది. ప్రస్తుతం హిందీ సినిమాలు వదిలేసి ఇంగ్లీష్ సినిమాలలో నటిస్తోంది.

తాజాగా అమెరికా వెళ్ళిన రాజమౌళి టీం ను కలిసింది ఈమె. ఇదిలా ఉంటే ఇక తనకంటే పదేళ్లు చిన్నవాడైనా హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈమె. అంతేకాదు సరోగసి ద్వారా ఒక పాపకి కూడా జన్మనిచ్చింది. తన కూతుర్ని కూడా చూపించింది ప్రియాంక చోప్రా. తాజాగా ఇంత గ్యాప్ తర్వాత మళ్లీ ఇండియాకి తిరిగి వచ్చింది ఈమె. అంతేకాదు ఇండియాలో తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ని కూడా ప్రారంభించాలని అనుకుంటుందట. అయితే ఈసారి బాలీవుడ్ లో కాకుండా సౌత్ పై దృష్టి పెట్టాలని భావిస్తోందట. టాలీవుడ్ హీరోలతో నటించడానికి రెడీగా ఉందని తెలుస్తోంది.తాజాగా దీనికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది.

అయితే వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ పాత ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ తో ప్రియాంక చోప్రా నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ప్రభాస్ మరియు హృతిక్ రోషన్ కాంబినేషన్లో ఒక భారీ బడ్జెట్ సినిమాను ప్లాన్ చేసినట్టుగా గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోని ఈ సినిమాలో ప్రియాంక చోప్రా ప్రభాస్ జంటగా నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాతో ప్రభాస్తో జతకట్టి టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు సందీప్ రెడ్డి మరియు ప్రభాస్ కాంబినేషన్లో రానన్న స్పిరిట్ సినిమాలో కూడా ప్రియాంక ని తీసుకుని ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇక ఈ రెండు సినిమాల్లో ప్రియాంక చోప్రాన్ నటించిన టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తుంది అని తెలుస్తోంది. అంతేకాదు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానున్నట్లుగా సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: