ఘనంగా ధనుష్ వాతి ఆడియో లాంచ్..!

Divya
ప్రస్తుత కాలంలో చాలామంది కోలీవుడ్ హీరోలు టాలీవుడ్ దర్శకులు డైరెక్షన్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంటే.. మరికొంతమంది టాలీవుడ్ హీరోలు కోలీవుడ్ డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే హీరో నాగచైతన్య కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో కస్టడి అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధం కాబోతోంది మరోపక్క వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కోలీవుడ్ హీరో విజయ్ వారసుడు సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన కొత్త సినిమాను ప్రారంభించబోతున్నారు.
తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా,  సంయుక్త మీనం హీరోయిన్ గా  తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రాబోతున్న సినిమా వాతి.. ఈ సినిమాను తెలుగులో సార్ పేరిట రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ను చెన్నైలో నిర్వహించగా ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు కూడా పెట్టింటే చాలా వైరల్ గా మారుతున్నాయి. డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న సమంత సినిమాకు పోటీగా ఈ సినిమాలో ఫిబ్రవరి 17వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు.
ఇకపోతే చెన్నైలో ఈ సినిమా ఆడియో లాంచ్ వెంటనే చాలా ఘనంగా నిర్వహించినట్లు అందుకు సంబంధించిన ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి ఈవెంట్లో సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిన ధనుష్ మెడలో రుద్రాక్ష మాల తో మాస్ లుక్ లో కనిపించాడు. అంతేకాదు ఈ ఆడియో లాంచ్ ఈవెంట్ కి పలువురు కోలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఇకపోతే ధనుష్ ఇటీవల తిరు సినిమా ద్వారా వారి పాపులారిటీ అందుకున్నారు కాబట్టి ఆయన తర్వాత సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి మరి ప్రేక్షకుల , అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా. ధనుష్ వాతి సినిమా ద్వారా ఏ విధమైన సక్సెస్ అందుకుంటాడు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: