బాలయ్యతో కాజల్ సినీ కెరియర్ మలుపు తిరుగుతుందా..!!

Divya
టాలీవుడ్ లో చందమామ సినిమాతో తన సినీ కెరీర్ ను మొదలు పెట్టింది హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఇక తర్వాత మగధీర సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది.ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి అగ్ర కథానాయకుడు సంపాదించింది. కెరియర్ కాస్త తగ్గుముఖం పడుతున్న సమయంలో కాజల్ అగర్వాల్ వివాహం చేసుకొని తల్లి అయ్యింది.సౌత్ హీరోయిన్ పెళ్లి అయ్యి తల్లిగా మారిన తర్వాత ఆఫర్లు రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది.

కాజల్ అగర్వాల్ తల్లయిన తర్వాత బాలకృష్ణ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమాలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ కన్ఫర్మ్ అయ్యిందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా ఈ సినిమా పైన అధికారికంగా ప్రకటన వెలుబడలేదు. బాలకృష్ణ గత చిత్రాలను పరిశీలిస్తే హీరోయిన్ పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యత కనిపించడం లేదు.ముఖ్యంగా అఖండ అంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ యొక్క కెరియర్ కు పెద్దగా కలిసి రాలేదు.
వీర సింహారెడ్డి సినిమాతో శృతిహాసన్ కు మంచి హైప్ వచ్చింది లేదు. ఇక బాలయ్య సినిమాలో నటించిన తర్వాత కాజల్ అగర్వాల్ పరిస్థితి ఏంటి అనే విషయం ఇప్పుడు చేర్చనీయాంశంగా మారుతోంది. కాజల్ అగర్వాల్ గతంలో మాదిరిగా తన అందాల ఆరబోత ఫోటోషూట్లతో మళ్ళీ సోషల్ మీడియాలో తెగ హడావిడి చేయడం జరుగుతోంది. కాజల్ అందం పెళ్ళికి ముందు కంటే ఇప్పుడు ఏమాత్రం తగ్గలేదు. కానీ కాస్త లావుగా ఉన్నట్లు కనిపిస్తోందని అభిమానులు భావిస్తున్నారు. కనుక బాలయ్య సినిమాలో మినిమం రోల్ లభించిన కూడా ముందు ముందు మరిన్ని సినిమాలలో ఆఫర్లు దక్కే అవకాశం అయితే పుష్కలంగా ఉంటాయని సినీ ప్రేక్షకులు తమ అభిప్రాయంగా తెలియజేస్తున్నారు. బాలయ్య సినిమాతో కాజల్ కెరియర్ మలుపు తిరుగుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: