రైటర్ పద్మభూషణ్ : సుహాస్ సినిమాకి భారీ వసూళ్లు?

Purushottham Vinay
పడిపడి లేచే మనసు, మజిలీ, ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య.. లాంటి పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా  మెప్పించాడు సుహాస్. కలర్ ఫోటో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం, ఆ సినిమాకి నేషనల్ అవార్డు రావడంతో సుహాస్ కి చాలా అవకాశాలు వరుసగా క్యూ కట్టాయి. దీంతో సుహాస్ హీరోగా, విలన్ గా ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.తాజాగా సుహాస్ హీరోగా చేసిన రైటర్ పద్మభూషణ్ సినిమా ఫిబ్రవరి 3 వ తేదీన రిలీజ్ అయింది. సుహాస్ హీరోగా చేసిన కలర్ ఫోటో సినిమా కరోనా లాక్ డౌన్ వల్ల ఓటీటీలో రిలీజ్ కావాల్సి వచ్చింది. రైటర్ పద్మభూషణ్ సినిమా థియేటర్స్ లో విడుదల అవ్వడంతో సుహాస్ కి హీరోగా ఇది ఫస్ట్ థియేట్రికల్ రిలీజ్ సినిమా అయ్యింది. ట్రైలర్, సాంగ్స్ తో ముందే ప్రేక్షకులని మెప్పించి సినిమాపై అంచనాలు పెంచేలా చేశాయి. రైటర్ పద్మభూషణ్ సినిమా అంచనాలు అందుకొని మంచి డీసెంట్ టాక్ తెచ్చుకొని ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి పరుగులు పెట్టిస్తుంది.చిన్న సినిమాగా విడుదలయ్యి పెద్ద హిట్ గా దూసుకుపోతుంది రైటర్ పద్మభూషణ్. రైటర్ పద్మభూషణ్ ఒక ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా మంచి విజయాన్ని సాధించింది.


ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ సరదాగా ఈ సినిమాకి వస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి రైటర్ పద్మభూషణ్ డీసెంట్ టాక్ తెచ్చుకోవడంతో వసూళ్లు కూడా బాగా వస్తున్నాయి. ఫస్ట్ డే ఈ సినిమా 1.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.ఇక రెండో రోజు అయితే అంతకంటే డబల్ కలెక్షన్స్ వసూలు చేసి అందర్నీ ఎంతగానో ఆశ్చర్యపరిచింది. రెండు రోజుల్లో రైటర్ పద్మభూషణ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 3.6 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యపరిచింది. అమెరికాలో అయితే ఏకంగా 175k డాలర్స్ వసూలు చేసి దూసుకుపోతుంది. ఇక ఈరోజు ఆదివారం కావడంతో కచ్చితంగా ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో 3 కోట్లు పెట్టి తీసిన ఈ సినిమా ఇప్పటికే 3.6 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసింది. అంటే ఈ సినిమా దాదాపు 2 కోట్ల షేర్ వసూళ్లు చేసింది. ఇక ఆదివారం కూడా రెండింతలు వసూళ్లు వచ్చే అవకాశం ఉండటంతో సినిమా లాభాల బాట పట్టింది. ఫుల్ రన్ లో ఈ సినిమా ఖచ్చితంగా భారీ లాభాలను దక్కించుకుంటుంది అంటున్నారు టాలీవుడ్ వర్గాలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: