వాణి జయరామ్ మరణానికి కారణం అదేనా..?

Divya
ఈ మధ్యకాలంలో వరుసగా సినీ ఇండస్ట్రీ లో పలు విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. నిన్నటి రోజున లెజెండ్రీ డైరెక్టర్ నటుడు కే విశ్వనాథ్ మరణ వార్త అందరిని కలిసివేసింది. ఇప్పుడు ఆ మరణ వార్త మరువకముందే ప్రముఖ గాయని వాణి జయరామ్ మృతి చెందడం జరిగింది. చెన్నైలో తన స్వగృహంలో ఈమె మరణించినట్లు తెలుస్తోంది. అది కూడా బాత్రూంలో వెళ్లి జారి పడడంతో ఈమె తలకు గాయమైనట్లుగా సమాచారం. దీంతో ఏమే మృతి చెందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

వాణి జయరామ్ కు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును కూడా ప్రకటించడం జరిగింది.ఈ అవార్డు అందుకోకముందే ఆమె మరణించడంతో అభిమానులు సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఈమె 1945 లో జన్మించింది. ఇక తన చిన్న వయసు నుంచే గాయనిగా బాగా పేరుపొందింది.ఎన్నో భాషలలో పలు వేల సంఖ్యలలో పాటలను పాడింది వాణి జయరామ్. ఇమే అసలు పేరు కలైవాణి. వాణి జయరామ్  కుటుంబంలో ఆరుగురు అక్కాచెల్లెళ్లు కాగా..వాణి జయరామ్ ఐదవ సంతానం 1970లో గుడ్డి చిత్రం ద్వారా ఈమె మొదటిసారిగా సినీ ప్రయాణం మొదలుపెట్టింది ఆ తరువాత ఎన్నో చిత్రాలలో గాయనిగా ప్రసిద్ధి పొందిన ఈమె అవార్డు రివార్డులను సైతం అందుకుంది.

కే విశ్వనాథ్ మరణించిన రెండవ రోజు ఈమె మృతి చెందడం విశేషమని చెప్పవచ్చు. ఆయన ప్రతి చిత్రంలో కూడా వాణి జయరామ్ పాట కచ్చితంగా పాట ఉండేదట. శంకరాభరణం నుంచి సిరివెన్నెల వరకు అన్ని చిత్రాలలో కూడా ఈమె పలు పాటలు పాడినట్లు తెలుస్తోంది. ఈమె పాటలు ఎన్నో సూపర్ డూపర్ హిట్ గా నిలిచి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.వాణి జయరామ్ తో తెలుగు సినీ ఇండస్ట్రీలు 24 గంటలు గడవక ముందే మరొక విషాన్ని వినవలసి వచ్చింది. దీంతో ఈమె ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: