సుహాస్ పుష్ప సినిమా లో ఆ పాత్ర చేయాల్సింది కానీ..!?

Anilkumar
కలర్ ఫోటో సినిమాతో హీరోగా మొదటి సినిమాతోనే మంచిది గుర్తింపును పొందాడు హీరో సుహాస్.ఈ సినిమాతో మంచి హిట్ ను కూడా అందుకున్నాడు. ఇక ఆ సినిమాతో హీరోగా మంచి హిట్ కొట్టిన సుహాస్ రైటర్ పద్మభూషణ్ అని సినిమాతో మళ్ళీ హీరోగా ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అయి పాజిటివ్ టాక్ ను అందుకుంది.ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది రైటర్ పద్మభూషణ్ సినిమా. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదలైన నేపథ్యంలో సుహాసికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హల్చల్ అవుతుంది. 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పుష్ప సినిమా దెబ్బకి ఉత్తర భారత దేశంలో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ బద్దలైంది. అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. కలెక్షన్ల సునామీ సృష్టించడంతో ఈ సినిమా ఇండియాలోనే హాట్ టాపిక్ గా మారింది. తెలుగులో ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా బాగానే అందుకుంది. అయితే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవడానికి ఈ సినిమాలో కేశవ అనే ఒక కీలక పాత్రలో నటించిన వ్యక్తి కూడా ప్లస్ అయ్యాడు అనడంలో ఇలాంటి సందేహం లేదు. ఇక ఈ పాత్ర జనాల్లోకి ఎంతగా వెళ్లిపోయింది అంటే ఆ పాత్రలో నటించిన ఆయన్ని బయట కూడా కేశవా అని పిలుస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ పాత్ర కోసం మొదట సుహాస్ కి అవకాశం వచ్చింది అంటూ సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా రైటర్ పద్మభూషణ్ సినిమా విడుదలైన నేపథ్యంలో ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇక ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.ఆయన మాట్లాడుతూ నేను నిజంగానే ఆడిషన్స్ కి వెళ్ళాను కానీ.. కేశవ పాత్రకి నేను సెలెక్ట్ అవలేదు అంటూ ఒక క్లారిటీ ఇచ్చాడు. అనంతరం కలర్ ఫొటోస్ సినిమాలో హీరోగా ఛాన్స్ వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. కలర్ ఫోటో సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ హీరో దాని అనంతరం ఫ్యామిలీ డ్రామాలు నటించిన జరిగింది. తాజాగా సుహాస్ హీరోగా రైటర్ పద్మభూషణ్ అనే సినిమాలో నటించి మరింత గుర్తింపును పొందాడు. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంతంలో వచ్చిన ఈ సినిమాలో టీనా శిల్ప రాజ్ హీరోయిన్ గా నటించింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: