విజయ్ దేవరకొండ వేసుకునే కాస్ట్యూమ్స్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. ఈమధ్య విజయ్ దేవరకొండ పేరు మీడియా లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా తరచుగా వినిపిస్తోంది. ఇటీవల విజయ్ దేవరకొండ రష్మిక మందనతో కలిసి మాల్దీవ్స్కో వెళ్ళినప్పటి నుండి వీరిద్దరిపై రకరకాల వార్తలు సోషల్ మీడియా వేదికగా వస్తూనే ఉన్నాయి.తాజాగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెకేషన్ కి వెళ్లడం జరిగింది. ఇక వాళ్లతో పాటు రష్మిక మందన కూడా వెళ్లింది. దీంతో చాలామంది రష్మిక మందన మరియు విజయ్ దేవరకొండ రిలేషన్షిప్ లో ఉన్నారని రకరకాల వార్తలు వినిపించాయి. 

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అవుదామని విజయ్ దేవరకొండ భావించినప్పటికీ ఆయన అనుకున్నట్లు జరగలేదు. ఆ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఇక ఈ సినిమా అనంతరం విజయ్ దేవరకొండ శివానిర్వాన దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఖుషి సినిమాలో నటిస్తున్నాడు. ఇన్ని రోజులు సమంత కారణంగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కాస్త ఆలస్యం అవుతూ వచ్చింది .ఈ సినిమాకి సంబంధించిన దాదాపు 25% షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. దీని అనంతరం జెర్సీ ఫ్రేమ్ గౌతమ్ తిననూరి డైరెక్షన్లో ఒక సినిమా చేయనున్నాడు. విజయ్ దేవరకొండ ఖుషి సినిమా కంప్లీట్ అయితే గాని ఆ సినిమా చేయడం కుదరదు.

ఎందుకు అంటే ఆ సినిమా కోసం విజయ్ దేవరకొండ తన హెయిర్ స్టైల్ ని పూర్తిగా మార్చాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే ఇక విజయ్ దేవరకొండ కి యూత్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన వేసుకునే డిఫరెంట్ కాస్ట్యూమ్స్ కి కూడా భారీ క్రేజ్ ఉంది. ఇటీవల ఈయన సొంతంగా క్లాత్ కూడా మొదలు పెట్టడం జరిగింది. దీంతో పాటు ఏవిడి సినిమాస్ పేరుతో ఏషియన్ సంస్థలతో కలిసి మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి కూడా ఎంటర్ అయ్యాడు విజయ్ దేవరకొండ. దాంతోపాటు ఇతర వ్యాపారాల్లో సైతం తన సంపాదనని ఇన్వెస్ట్ చేస్తున్నాడు విజయ్. ఇదిలా ఉంటే ఇక ఎప్పుడో తాజాగా విజయ్ దేవరకొండ ధరించిన షర్ట్స్ మరియు సూట్ లకి సంబంధించిన బ్రాండ్స్ మరియు వాటి ధరల కి సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ ఆవుతున్నాయి..విజయ్ వేసుకునే... Versace - బ్లాక్ లా కూపే డైయుక్స్ బెర్ముడా షార్ట్స్.. రేటు : రూ. 86,712.. వరుణ్ బాహ్ల్ - బ్లాక్ వెల్వెట్ సూట్ సెట్.. రేటు : రూ. 1,95,000..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: