సిల్క్ స్మిత విషయంలో మాట నిలబెట్టుకున్న అర్జున్.!

Divya
వ్యాంప్ పాత్రలకు పెట్టింది పేరు సిల్క్ స్మిత.. తెలుగులో హీరోయిన్ అవ్వాలని ఎన్నో కలలు కంది.. కానీ తెలుగు పరిశ్రమ ఈమెకు అవకాశాలు ఇవ్వలేదు. కానీ ఈమె ప్రతిభను గుర్తించిన మలయాళం ఇండస్ట్రీ మొదటగా అవకాశాలు ఇవ్వడంతో అక్కడే తన ప్రతిభను నిరూపించుకుంది. ఆ తర్వాత తమిళ్లో అడపాదడపా సినిమాలు చేయడంతో ఈమెకు మరింత పాపులారిటీ లభించిందని చెప్పవచ్చు. ఐటెం సాంగ్స్ చేయడమే కాదు ఐటెం పాత్రలు పోషిస్తూ తన అందాలతో యువతకు చెమటలు పట్టించింది. సిల్క్ స్మిత కోసమే థియేటర్కు వెళ్లిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.
తన సినీ ప్రస్థానంలో ఏకంగా 450 కి పైగా చిత్రాలలో నటించిన ఈమె 80 వ దశకంలో దక్షిణాది చిత్రసీమను ఏకచత్రాధిపత్యంగా ఏలారు. ముఖ్యంగా చాలామంది దర్శక నిర్మాతలు ఈమె కోసం క్యూ కట్టేవారు. అతి తక్కువ సమయంలోనే 500కు చేరువలో చిత్రాలు తెరకెక్కించి.. మరింత పాపులారిటీ దక్కించుకొని ఎంతోమంది అబ్బాయిల కలల రాకుమారిగా మారిన ఈమె 36 సంవత్సరాలకే ఆత్మహత్య చేసుకుని మరణించింది. అయితే ఈమెది హత్య అని.. ఇప్పటికీ కూడా వాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే సిల్క్ స్మితకు సంబంధించిన ఎప్పటికప్పుడు వార్తలు బాగా వైరల్ అవుతూ ఉంటాయి.
సిల్క్ స్మిత మరణ వార్త విని సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి అయ్యింది. ఇంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న సిల్క్ స్మిత మరణించినప్పుడు ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా చూడడానికి రాకపోవడం జర్నలిస్టులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. చివరిగా అర్జున్ సర్జ మాత్రమే సిల్క్ స్మిత చనిపోయినప్పుడు చూడడానికి రావడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. అంతేకాదు ఇదే మాటనే కొంతమంది జర్నలిస్టులి  అర్జున్ ని అడగగా..అంతకు కొద్ది రోజుల ముందే సినిమా షూటింగ్ చివరి రోజుల్లో నేను చనిపోతే చూడడానికి వస్తావా?  అని సిల్క్ స్మిత అడిగింది.  ఛీ అదేమి మాట?  అని నేను తేలిగ్గా కొట్టి పారేశాను.  కానీ ఆమె నిజంగా మరణించడం తట్టుకోలేకపోతున్నాను అంటూ చిన్నపిల్లాడిలా ఏడ్చేశారు అర్జున్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: