మహేష్ త్రివిక్రమ్ కాంబో సినిమాలో అలాంటి పాత్రలో రమ్యకృష్ణ..!?

Anilkumar
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక భారీ బడ్జెట్ సినిమా రానున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి జరుగుతున్న షూటింగ్ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా లీకై బాగా వైరల్ అవుతున్నాయి. ఇలా ఉంటే ఇక ఈ సినిమాలో ఈ సినిమా కథను మలుపు తిప్పే పాత్ర కోసం నటి శోభనను సంప్రదించినట్లుగా తెలుస్తుంది. సంప్రదించినప్పటికీ శోభన ఈ సినిమాలో నటిస్తుందా లేదా అన్నదానిపై తాను క్లారిటీ ఇవ్వలేదు. 

దీంతో శోభన ఈ సినిమాకు అంగీకరించలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కథను మలుపు తిప్పే పాత్ర కోసం శోభన కి బదులుగా రమ్యకృష్ణను ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు త్రివిక్రమ్ మరియు రమ్యకృష్ణ కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా లేదు. సాధారణంగా త్రివిక్రమ్ ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు అంటే ఆ సినిమాలో ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇక ఈ కారణంగానే రమ్యకృష్ణ కూడా త్రివిక్రమ్ మరియు మహేష్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో నటించేందుకు ఒకింత ఆసక్తితోనే ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం రమ్యకృష్ణ భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నప్పటికీ ఈమె ఒక సినిమాలో నటిస్తుంది అంటే తెలుగు తో  పాటు మరితర భాషల్లో కూడా మంచి క్రేజ్ ఆ సినిమాకు దక్కుతుంది అని చాలామంది భావిస్తున్నారు. మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న ఈ సినిమా ఈ ఏడాది విడుదల కానుందని తెలుస్తోంది. అంతేకాదు భారీ అంచనాల నడుమ ఈ సినిమా విడుదలై మంచి కలెక్షన్లను అందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కబోయే ఈ సినిమా ఓటిటి హక్కులు ఏకంగా 80 కోట్ల రూపాయలకు అమ్ముడు అయ్యాయని తెలుస్తోంది. అంతేకాకుండా వీరిద్దరి కాంబినేషన్లో రానున్న ఈ సినిమా నైజాం హక్కులు 50 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది రానున్న ఈ సినిమాతో మహేష్ బాబు మరో హిట్ సినిమాని అందుకుంటాడని మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: