అయ్యో!! సన్నీలియోన్ కు ఏమైంది...?

murali krishna
సన్నీలియోన్ అంటే తెలియని వారు వుండరు.. బాలీవుడ్లో వరుస చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ తన హాట్ అందాలతో పలు చిత్రాలలో ఐటెం సాంగ్స్ లో కూడా నటించింది.

ప్రస్తుతం సన్నీలియోన్ దక్షిణాది లో కూడా పలు చిత్రాలలో నటిస్తూ చాలా బిజీగా ఉంటోంది. సన్నీలియోన్ నటిగా కూడా ప్రస్తుతం ఐదు సినిమాలలో నటిస్తున్నట్లు సమాచారం

ప్రస్తుతం దక్షిణాది సినిమాలకు సంబంధించి షూటింగ్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే షూటింగ్ సెట్లు సన్నీలియోన్ కు పెద్ద గాయమైనట్టు సమాచారం.తన కుడి బొటన వేలికి ఏదో గాయమైనట్టుగా ఒక వీడియో ను తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం జరిగింది. దీంతో ఈమెకు రక్తం కూడా వచ్చిందట..దెబ్బ చూడడానికి చిన్నదిగా ఉన్నా సన్నీలియోన్ కేకలతో బాగా రచ్చ రచ్చ చేస్తోంది. ఈ సందర్భంగా వెంటనే సిబ్బంది ఆమెకు ఫస్ట్ ఎయిడ్ చేసినట్లు సమాచారం.. దీంతో నెమ్మదిగా ఆ గాయాన్ని క్లీన్ చేయండి అంటూ వారిపై అరుస్తున్నట్టుగా ఈ వీడియోలో అయితే కనిపిస్తోంది. 

ఇక ఇంజక్షన్ లాంటివి అస్సలు వద్దంటూ వారిని హెచ్చరించింది.. సన్నీ లియోన్ ధరించిన సినిమా డ్రెస్ ను బట్టి  తన తరువాత సినిమాలో సన్నీలియోన్ డి గ్లామర్ పాత్ర లో కనిపించబోతున్నట్లు గా తెలుస్తోంది.అయితే అభిమానులు మాత్రం సన్నీ పాపకు ఏమైంది అంటూ కామెంట్ కూడా చేస్తున్నారు సన్నీ బాధపడొద్దు అంటూ పలు రకాలుగా కామెంట్స్ కూడా చేస్తున్నారు అభిమానులు. ఈ వీడియో షేర్ చేసిన కొన్ని క్షణాలలోనే తెగ వైరల్ గా మారుతోంది. మొదట తెలుగులో కరెంటు తీగ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత రాజశేఖర్ నటించిన గరుడవేగ సినిమాలో కూడా హాట్ సాంగ్ లో నటించింది. ఆ తరువాత మంచు విష్ణు జిన్నా సినిమాలో నట విశ్వరూపం చూపింది.ప్రస్తుతం ఈ వీడియో మాత్రం బాగా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: