"ఆర్సి 15" నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడో తెలుసా..?

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ టాలెంట్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ రామ్ చరణ్ కెరియర్ లో 15 వ మూవీ గా రూపొందుతూ ఉండడం ... ఈ మూవీ కి చిత్ర బృందం ఇప్పటివరకు టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ యూనిట్ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో జరుపుతుంది.  ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు.

ఎస్ జె సూర్య విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సునీల్ , అంజలి ఇతర కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఇది ఇలా ఉంటే నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. చాలా రోజుల క్రితమే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికి కూడా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ రామ్ చరణ్ , కియారా లపై న్యూజిలాండ్ లో భారీ ఖర్చుతో ఒక షెడ్యూల్ ను నిర్వహించింది. ఈ షెడ్యూల్ లో ఈ మూవీ యూనిట్ హీరో ... హీరోయిన్ లపై ఒక పాటను మరియు మరికొన్ని కీలక సన్నివేశాలను కూడా ఈ చిత్ర బృందం చిత్రీకరించినట్లు సమాచారం.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ తాజా షెడ్యూల్ కు సంబంధించిన ఒక వార్త బయటకు వచ్చింది. ఈ మూవీ యొక్క నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనున్నట్లు ... ఈ షెడ్యూల్ రెండు రోజుల పాటు జరగనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో రెండు రోజుల పాటు జరగనున్న షెడ్యూల్ లో చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ ... శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ కావడంతో ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు సినీ ప్రేమికుల్లో నెలకొని ఉన్నాయి. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ ... బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరో గా నటించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: