చిరంజీవి తో క్లాష్ వద్దు అని అలాంటి నిర్ణయం తీసుకున్న మహేష్ బాబు..!?

Anilkumar
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమా వచ్చి ఇప్పటికీ చాలాకాలం అయింది. మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా వచ్చి చాలా కాలం అవుతున్నప్పటికీ మహేష్ బాబు తన తదుపరి సినిమా గురించి గానీ తన తదుపరి సినిమా విడుదల గురించి కానీ ఇప్పటివరకు ఇలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇందులో భాగంగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు మహేష్ బాబు కాంబినేషన్లో ఒక సినిమా రానుంది అని ఇక ఆ సినిమా ఆగస్టులో విడుదల అవుతుంది అని అందరూ భావిస్తున్నారు. 

కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని అక్టోబర్ లో విడుదల చేయాలని వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. అయితే దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి అని తెలుస్తోంది.ఇందులో భాగంగానే సూపర్ స్టార్ మహేష్ బాబు చిరంజీవి తో క్లాస్ అవ్వకుండా ఉండడానికి మహేష్ బాబు తన సినిమాని వాయిదా వేసుకున్నాడట. అయితే ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న అనంతరం త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి, భోళా శంకరనే సినిమాతో మళ్ళీ పేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టులో విడుదల కానుందని చిత్ర బృందం ఇప్పటికీ ప్రకటించిన సంగతి మన అందరికీ తెలిసిందే. దీంతో మహేష్ బాబు తన సినిమాని అక్టోబర్ కి వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది.ssmb 28 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా హీరోయిన్గా ఈ సినిమాలో పూజ హెగ్డే నటిస్తోంది. హారిక మరియు హాసిని క్రియేషన్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. మహేష్ బాబు మరియు పూజ హెగ్డే లతోపాటు జగపతిబాబు ప్రకాష్ రాజ్ మరియు మురళీ శర్మ ఈ సినిమాలో కొన్ని కీలక పాత్రలో నటిస్తున్నారు.గతంలో వచ్చిన అతడు ఖలేజా వంటి సినిమాల అనంతరం మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఈ సినిమా రావడంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: