మహేష్ తో సినిమా తర్వాత.. జక్కన్న టార్గెట్ అదేనా?

praveen
బాహుబలి తర్వాత చాలా గ్యాప్ తీసుకుని రాజమౌళి త్రిబుల్ ఆర్ అనే మల్టీస్టారర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు అన్న విషయం తెలిసిందే. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కిన  ఈ సినిమా ఇక అందరూ ఊహించినట్లుగానే పాన్ ఇండియా రేంజ్ లో విజయం సాధించింది అని చెప్పాలి. ఈ సినిమాలో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం పాత్రలలో నటించారు అని చెప్పాలి. ఇక మొన్నటి వరకు ఈ సినిమా సక్సెస్ ని ఎంతగానో ఎంజాయ్ చేసిన రాజమౌళి ఇక ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నాడు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే రాజమౌళి మహేష్ బాబు తో సినిమాకు ఎలాంటి కాన్సెప్టును అనుకున్నాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఈ సినిమాను మరింత గ్రాండ్ గా తెరకెక్కించబోతున్నాడు అన్నది తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా పూర్తయిన వెంటనే బాహుబలి 3, త్రిబుల్ ఆర్ 2 సినిమాలలో ఏదో ఒకటి పట్టాలెక్కించబోతున్నాడట జక్కన్న. ఈ రెండు సినిమాలకు కూడా భారీ స్థాయిలోనే ఫాన్స్ ఉన్నారు. ఇక ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాలో తెరకెక్కించిన దాదాపు 500 కోట్ల వరకు బడ్జెట్ అవడం ఖాయం. అయితే ఇక బాహుబలి 3 కాకుండా త్రిబుల్ ఆర్ 2 సినిమాకే ఎక్కువగా జక్కన్న ప్రాధాన్యం ఇస్తున్నాడట.

 ఎందుకంటే అటు బాహుబలితో పోల్చి చూస్తే త్రిబుల్ ఆర్ కు కూడా సమానమైన గుర్తింపు వచ్చినప్పటికీ అంతర్జాతీయ అవార్డుల విషయంలో మాత్రం త్రిబుల్ ఆర్ బాహుబలి కంటే ఒక మెట్టు పైనే ఉంది అని చెప్పాలి. మరోవైపు ఇక ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. దీంతో డేట్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఈ క్రమంలోనే ఇక త్రిబుల్ ఆర్ 2 సినిమా పైనే రాజమౌళి దృష్టి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక అప్పటివరకు టెక్నాలజీ పరంగా అప్డేట్ అవుతుంది. కాబట్టి ఇక త్రిబుల్ ఆర్ 2 సినిమా ఊహకందని రీతిలో ఉంటుందని ఎంతోమంది ఫాన్స్ కూడా అంచనాలు పెట్టుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: