చిరుని, చరణ్ ని దారుణంగా ట్రోల్ చేస్తున్న రవితేజ ఫ్యాన్స్?

Purushottham Vinay
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి  సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆ సినిమా సక్సెస్ వేడుక ను వరంగల్ లో భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది.మెగాస్టార్ చిరంజీవి తో పాటు ఆ సక్సెస్ వేడుకలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సందడి చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ చిరంజీవి సౌమ్యుడు కావచ్చు కానీ ఆయన కుటుంబ సభ్యులమైన మేము ఇంకా ఆయన అభిమానులు సౌమ్యులు కారు అన్నట్లుగా చిరంజీవిపై విమర్శలు చేసే వారిని తన మాటలతో హెచ్చరించాడు.ఇంకా అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా మాట్లాడుతూ.. సినిమాలో తాను రవితేజ వాల్ పోస్టర్ ని తన లుంగితో తుడిచి ముద్దు పెట్టిన సీన్ గురించి వివరించాడు. ఆ సందర్భంగా రవితేజను చిన్న హీరో అంటూ చిరంజీవి ప్రస్తావించడం ఏమాత్రం కరెక్ట్ కాదు అంటూ రవి తేజ ఫ్యాన్స్ కోపం వ్యక్తం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో యాంటీ మెగా ఫ్యాన్స్ స్పందిస్తూ రవితేజ చిన్న హీరో ఎలా అవుతారు అంటూ చిరంజీవిని ప్రశ్నిస్తున్నారు.అసలు ఆ రవితేజ ఉండడం వల్లనే వాల్తేరు వీరయ్య సినిమా ఇప్పుడు ఇంత పెద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుందని... అసలు ఆయన లేకుంటే కచ్చితంగా ఈ స్థాయి విజయం వాల్తేరు వీరయ్య కు సొంతం అయ్యేది కాదు అంటూ రవి తేజ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


ఒకప్పుడు రవి తేజ అంటే మినిమమ్ గ్యారెంటీ హీరో. గత కొంత కాలంగా ప్లాపుల్లో ఉన్న రవితేజకు గత చిత్రం ధమాకా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ నమోదు చేసిన విషయం తెలియదా అంటూ చిరంజీవిని ట్రోల్ చేస్తున్నారు. ఇక అంతకు ముందు కూడా రవితేజ నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి.అసలు ఎందుకు రవితేజ మీకు చిన్న హీరో అనిపించాడు అంటూ చిరంజీవిని ట్రోల్ చేస్తున్నారు.అలాగే రామ్ చరణ్ కూడా సక్సెస్ మీట్ లో రవితేజ అని పేరు పెట్టి ప్రస్తావించడం పై కూడా మాస్ రాజా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రవితేజ అనుభవం అంత ఉండదు నీ వయస్సు.. మీ బాబాయ్ పవన్ కళ్యాణ్ కంటే పెద్ద వాడైనా రవితేజని ఏకవచనంతో పిలుస్తావా అంటూ ట్రోల్ చేస్తున్నారు. రవి తేజ ఫ్యాన్స్.. ఈ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: