అందరికీ ఆమె లక్కీ హీరోయిన్.. కానీ రవితేజకు మాత్రం?

praveen
సాధారణంగా ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం వరుసగా సూపర్ హిట్ లు సొంతం చేసుకుంటూ ఇక దర్శక నిర్మాతలకు ఎంతో మంది హీరోలకు కూడా లక్కీ హీరోయిన్గా మారిపోతూ ఉంటారు అని చెప్పాలి.  ఇలా టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోయిన్ లు ఉన్న లక్కీ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకున్న వారిలో కాజల్ అగర్వాల్ మొదటి వరుసలో ఉంటారు. ప్రభాస్ తారక్ చరణ్ లాంటి ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టింది కాజల్ అగర్వాల్.

 అందుకే హీరోలు మాత్రమే కాదు అటు దర్శక నిర్మాతలు కూడా కాజాల్ ను లక్కీ హీరోయిన్గా భావిస్తూ.. ఇక తమ సినిమాల్లో ఛాన్స్ ఇస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇలా ఎంతోమంది హీరోలకు లక్కీ హీరోయిన్గా కలిసి వచ్చి సూపర్ హిట్ లకు కారణమైన కాజల్ అగర్వాల్ ఒక్క హీరో విషయంలో మాత్రం అస్సలు అచ్చి రాలేదు అన్నది తెలుస్తుంది. ఆ హీరో ఎవరో కాదు మాస్ మహారాజా రవితేజ. కాజల్ రవితేజ కాంబినేషన్లో వీర, సారోచ్చారు సినిమలు ప్రేక్షకులను పలకరించాయి. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్స్ సొంతం చేసుకున్నాయ్ అన్న విషయం తెలిసిందే.

 రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన వీరా సినిమాలో పవర్ఫుల్ పాత్రలో నటించాడు రవితేజ.  ఈ సినిమాలో రవితేజ సరసన రొమాన్స్ చేసింది కాజల్ అగర్వాల్. 2011లో విడుదలైన ఈ సినిమా అన్నాచెల్లెల సెంటిమెంట్తో వచ్చింది.  అయితే ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత పరశురాం డైరెక్షన్లో భారీ బడ్జెట్ తో సారోచ్చారు సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో కూడా మరోసారి ఇక రవితేజ సరసన కాజల్ నటించింది. కానీ ఈ సినిమా మాత్రం ఫ్లాప్ గానే మిగిలిపోయింది అని చెప్పాలి. ఇక రవితేజ తాప్సి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: