ధమాకా: రవితేజ ఖాతాలో మరో రేర్ రికార్డ్?

Purushottham Vinay
కొన్ని సినిమాలు రోట్ట రొటీన్ కథలతో వచ్చినా కూడా ప్రేక్షకులను మాత్రం అంచనాలను మించి అవి హిట్ అయ్యి బాగానే ఆకట్టుకుంటాయి. అలా అంచనాలకు మించి ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలలో రీసెంట్ గా విడుదల అయిన ధమాకా సినిమా కూడా ఒకటి.మాస్ మహారాజా రవితేజ ఇంకా కుర్ర హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో ఇప్పటికీ కూడా చాలా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.ఈ సినిమా రవి తేజ కెరీర్ లోనే 100 కోట్ల వసూళ్లు సాధించిన తొలి సినిమాగా నిలిచింది. ఇక ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. థియేటర్లలో ఈ సినిమాను చూడలేని ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాని చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.ఇక నెట్ ఫ్లిక్స్ లో ప్రస్తుతం ఇండియా వైడ్ సెకండ్ ప్లేస్ లో ఈ సినిమా ట్రెండింగ్ అవుతుండటంతో మాస్ రాజా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.


 రవితేజ కష్టపడి  అంతకంతకూ ఎదగడంతో పాటు ఈ సినిమాతో అరుదైన రికార్డ్ లను తన ఖాతాలో వేసుకుంటున్నారు. ధమాకా సినిమా రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందేమో చూడాలి. అయితే ఈ సినిమా క్రిటిక్స్ ను పెద్దగా మెప్పించలేకపోయినా ఆడియన్స్ కు మాత్రం బాగా నచ్చేసింది. ఈ సినిమా సక్సెస్ తో త్రినాథరవు నక్కిన రేంజ్ కూడా బాగా పెరిగిపోయిందనే చెప్పాలి.త్రినాథరావు నక్కిన తన సినిమాలలో ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సినిమా హిట్ కావడం వల్ల మరోవైపు రవితేజ ఫ్యూచర్ ప్రాజెక్ట్ లపై భారీ రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి. వయస్సు పెరుగుతున్నా కూడా మాస్ మహారాజ్ రవితేజ ఎనర్జీ లెవెల్స్ ఏ మాత్రం తగ్గడం లేదు.వరుస ప్లాపుల తరువాత ఇప్పుడు మాస్ మహారాజ్ రవితేజ కెరీర్ విషయంలో తప్పటడుగులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరికొన్ని సంవత్సరాల పాటు ఇలాంటి హిట్స్ కొట్టాలని మాస్ మహారాజా రవితేజ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: