చిరంజీవికి ఆ సత్తా ఉంది.. మీరు నోరు మూసుకోండి : తమ్మారెడ్డి

praveen
2023 ఏడాదిని అటు టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఎంతో ఘనంగా ప్రారంభించింది. బాలకృష్ణ, చిరంజీవి లాంటి స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు వచ్చాయి. ఇక ఒకే నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఈ సినిమాలు విడుదలయ్యాయి అని చెప్పాలి. దీంతో ఇక ఈ సినిమాల్లో ఏది సూపర్ హిట్ అవుతుంది అని అందరూ ఎదురు చూడగా. ఇక ఒకవైపు బాలయ్య మరోవైపు చిరంజీవి కూడా సూపర్ హిట్ కొట్టేశారు అని చెప్పాలి. అయితే రెండు సినిమాలు కూడా యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలే కావడం గమనార్హం.

 అయితే వీర సింహారెడ్డి సినిమాలో యాక్షన్ మాత్రమే ఎక్కువగా ఉంటే అటు వాల్తేరు వీరయ్య సినిమాలో మాత్రం చిరంజీవి స్టైల్ ఎంటర్టైన్మెంట్ ఇక వింటేజ్ చిరుని మరోసారి ప్రేక్షకులు చూస్తారు. ఇక ఇదే ఈ సినిమాకు మరింత ప్లస్ పాయింట్ గా మారిపోయింది. వాల్తేరు వీరయ్యలో ఇక మరోసారి చిరంజీవి తనదైన శైలిలో ఎంటర్టైన్మెంట్ పండించిన విధానంతో ప్రేక్షకులందరూ మైమరిచిపోతున్నారు. అయితే ఎప్పటిలాగానే ఈ సినిమాలపై నెగటివ్ కామెంట్స్ వచ్చాయి అని చెప్పాలి. అసలు చిరంజీవి ఈ సినిమాలో ఏం చేశాడని.. కథలో కూడా పెద్దగా బలం లేదు అంటూ అందరూ కామెంట్ చేస్తుండగా ఇదే వ్యాఖ్యలపై ఇక సినీ ఇండస్ట్రీలో పెద్దాయనగా కొనసాగుతున్న నిర్మాత తమ్మరెడ్డి భరద్వాజ్ స్పందించారు.

 ఈ వయసులో కూడా అలా చేయడం చాలా కష్టం. చిరు ఒక ఫ్యామిలీ ఎమోషన్ తో ఉన్న సినిమాతో వస్తే ఆల్ ఇండియాలో 1000 కోట్లు కలెక్షన్స్ రాబట్టగల సత్తా ఆయనకు ఉంది. ఆ రేంజ్ లో ఆయన క్రేజ్ కొనసాగుతుంది. సరైన సినిమా పడితే చిరు రికార్డులు కొల్లగొడతారు అంటూ నెగిటివ్ కామెంట్స్ చేసేవారి నోళ్లు మూయించారు  భరద్వాజ. ఇక ఈ సంక్రాంతికి వచ్చింది రెండు సినిమాలు కూడా మంచి హిట్ అయి రెవిన్యూ తెచ్చాయి. చిత్ర పరిశ్రమలో  కొత్త ఏడాదిలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి అంటూ తమ్మారెడ్డి భరద్వాజ రిప్లై ఇచ్చారు. కాగా సంక్రాంతికి వచ్చిన ఈ రెండు సినిమాలో హిట్ అవడంతో ఇక ఫాన్స్ మధ్య కూడా ఎలాంటి గొడవలు లేకుండా పోయాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: