రవితేజ "రావణాసుర" షూటింగ్ లేటెస్ట్ అప్డేట్ న్యూస్..!

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా పోయిన సంవత్సరం రవితేజ ఏకంగా మూడు మూవీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో మొదటగా ఖిలాడి మూవీ తో రవితేజ ప్రేక్షకులను పలకరించగా ఆ తర్వాత రామారావు ఆన్ డ్యూటీ ... ధమాకా మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూడు మూవీ లలో ఖిలాడి మరియు రామారావు ఆన్ డ్యూటీ మూవీ లు ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహపరచగా ... పోయిన సంవత్సరం చివరన విడుదల అయిన ధమాకా మూవీ తో రవితేజ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని తిరిగి ఫామ్ లోకి వచ్చాడు.

ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం ప్రారంభంలో జనవరి 13 వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల అయిన వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ ఒక కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాలో చిరంజీవి హీరోగా నటించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇలా వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్న రవితేజ ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న రావణాసుర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభిస్తుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పోలీస్ అకాడమీలో జరుగుతున్నట్లు సమాచారం. పోలీస్ అకాడమీలో ఈ మూవీ యూనిట్ ప్రస్తుతం సాంగ్ షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే రెండు పాటల షూటింగ్ ను పూర్తి చేస్తే ఈ సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి కానున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: