బాలకృష్ణకు కలసి వస్తున్న విజయ్ దేవరకొండ మౌనం !

Seetha Sailaja
స్టార్ మా యాజమాన్యం ఈ సంవత్సరం సమ్మర్ చివరిలో మొదలుకాబోయే ‘బిగ్ బాస్’ సీజన్ 7ను హోస్ట్ చేయగల సెలెబ్రెటీల పేర్లు షార్ట్ లిస్టు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ లిస్టులో విజయ్ దేవరకొండ రానా లతో పాటు బాలకృష్ణ పేరు కూడ ఉన్నట్లు లీకులు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారంమేరకు ఈషోలో పాల్గొనే హోస్ మేట్స్ తో పాటు ఆ షోను హోస్ట్ చేయగల సామర్థ్యం విజయ్ దేవరకొండకు ఉంది అన్న భావనతో బిగ్ బాస్ టీమ్ ఈమధ్య విజయ్ దేవరకొండతో ఈవిషయమై చర్చలు జరిపినట్లు టాక్.

అయితే ఈ షోను హోస్ట్ చేసే విషయంలో విజయ్ ఇప్పటివరకు ఒక స్థిర నిర్ణయానికి రాలేదని అందువల్ల అతడి అంగీకారం ఇంకా పెండింగ్ లో ఉంది అని అంటున్నారు. విజయ్ కాకుంటే రానా పేరు పరిసీలిస్తున్నప్పటికీ అతడికంటే ‘అన్ ష్టాపబుల్’ షోతో యూత్ కు బాగా దగ్గర అయిన బాలకృష్ణ పేరు కూడ స్టార్ మా యాజమాన్యం పరిశీలనలో ఉంది అని అంటున్నారు.

లేటెస్ట్ గా విడుదలైన ‘వీరసింహారెడ్డి’ మూవీ కలక్షన్స్ బాలయ్య కెరియర్ లో ఇప్పటివరకు ఎరుగని స్థాయిలో వచ్చాయి అన్నప్రచారం జరుగుతున్న పరిస్థితులలో  ప్రస్తుత తరం యూత్ లో బాలయ్యకు పెరిగిన మ్యానియా ‘బిగ్ బాస్’ షోకు కలిసి వస్తుందని స్టార్ అంచనా అని తెలుస్తోంది. దీనికితోడు బాలకృష్ణ జోక్స్ వేసి నవ్వించడండంలో దిట్ట కాబట్టి అతడి హాస్య చతురత ఈషో విజయానికి అన్ని విధాల సహకరిస్తుందని స్టార్ మా యాజమాన్యం ఒక అంచనాకు వచ్చిందని మరికొందరు అంటున్నారు.  

అయితే ఈవిషయమై మరొక వాదన వినిపిస్తోంది. గతంలో ఈ షోను హోస్ట్ చేసి విజయవంతంగా నడిపించిన జూనియర్ ఎన్టీఆర్ చేతిలో ఈ షోను పెడితే రేటింగ్స్ విషయంలో ఎదురు ఉండదని మరొక అంచనా స్టార్ మా కు ఉన్నట్లు టాక్. ఇన్ని ఆలోచనల మధ్య చివరకు ఈ షోను ఎవరు హోస్ట్ చేస్తారు అన్నది ప్రస్తుతానికి ఎవరికీ తెలియని విషయం..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: