ఆకట్టుకుంటున్న ' ఓ సాథియా' టైటిల్ సాంగ్.. సోషల్ మీడియాలో అనూహ్య స్పందన..!!

Anilkumar
ప్రస్తుతం సినీ పరిశ్రమలో సంగీతానికి ఎంత ప్రాధాన్యత ఉందో తెలిసిందే. ఓ పాట హిట్ అయిందంటే ఆటోమేటిక్గా సినిమాపై హైప్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. అంతెందుకు సినిమాలో పాటలు హిట్ అయితే సినిమా కూడా హిట్ అవుతుందని అందరూ నమ్ముతారు. అందులోనూ లవ్ సాంగ్స్, మెలోడీ సాంగ్స్ శ్రోతలను ఇట్టే ఆకట్టుకుంటూ ఉంటాయి. అలాంటి చక్కటి లవ్ సాంగ్స్ తో ఓ మంచి ప్రేమ కథ తో 'ఓ సాథియా' అనే సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. దివ్య భావన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని తన్విక జశ్విక క్రియేషన్స్ బ్యానర్ పై చందన కట్ట నిర్మిస్తున్నారు.

సినిమాలో ఆర్యన్ గౌరా, మిస్టీ చక్రవర్తి జంటగా నటిస్తున్నారు. ఇక ఆర్యన్ గౌరా అంతకుముందు 'జి జాంబి' అనే సినిమా లో హీరోగా నటించాడు. ఇప్పుడు ఓ సాథియా అనే సినిమాతో రాబోతున్నాడు. ఇటీవలే రాజమౌళి తండ్రి, లెజెండ్రీ రైటర్ విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ను విడుదల చేయగా.. దానికి అనూహ్య స్పందన వచ్చింది. ఇక తాజాగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ చేతుల మీదుగా విడుదల చేసిన ఓ సాథియా టైటిల్ సాంగ్ కి ఇప్పుడు సోషల్ మీడియా అంతటా విశేషమైన స్పందన వస్తోంది. అతి కొద్ది సమయంలోనే వన్ మిలియన్ వ్యూస్ కి చేరువలో ఉన్న ఈ పాటకి విన్ను సంగీతం అందిచగా..

జావేద్ అలీ గాత్రం భాస్కరభట్ల సాహిత్యం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ లిరికల్ వీడియోలోని విజువల్స్ చూస్తే సినిమా ఎంత రిచ్ గా తీసారో అర్థమవుతుంది. ఈ సినిమాకు ఈజే వేణు సినిమాటోగ్రఫీ మరింత ప్లస్ అవుతుందని చెప్పుకోవచ్చు. ప్యూర్ లవ్ స్టోరీ గా రాబోతున్న ఈ మూవీపై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనుంది చిత్ర బృందం. ఇక ఈ సినిమా సాంకేతిక బృందం విషయానికి వస్తే.. దర్శకత్వం: దివ్య భావన, నిర్మాత: చెందిన కట్ట, బ్యానర్: తన్విక జశ్విక క్రియేషన్స్, సంగీత దర్శకుడు: విన్ను, ఎడిటర్: కార్తీక్ కట్స్, కెమెరామెన్: ఈజే వేణు, పిఆర్ఓ: సాయి సతీష్, పాటలు: భాస్కరభట్ల, అనంత శ్రీరామ్, రాంబాబు గోసాల కొరియోగ్రాఫర్స్: రఘు మాస్టర్, ఆనీ మాస్టర్, బాబా భాస్కర్ మాస్టర్...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: