అలా చేసినందుకు నా భార్య నన్ను ఇంట్లోకి రానివ్వలేదు..హీరో సుహాస్ షాకింగ్ కామెంట్స్..!?

Anilkumar
కలర్ ఫోటో సినిమా హీరో సుహాస్ చాలామందికి తెలిసే ఉంటాడు.టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా విలన్ గా హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం హీరోగా మంచి అవకాశాలను అందుకుంటున్నాడు.హీరో గానే కాకుండా విలన్ పాత్రలో కూడా నటిస్తున్నాడు సుహాస్. కలర్ ఫోటో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన త్వరలోనే రైటర్ పద్మభూషణం అనే సినిమా ద్వారా తిరిగి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన ఒక ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా అయినా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.. 

ఆ ఇంటర్వ్యూలో భాగంగా సుహాసి మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని తను పెళ్లి చేసుకున్న విషయం కనీసం తన స్నేహితులకు కూడా తెలియదని పెళ్లి చేసుకున్నానంతరం సినీ కెరియర్ లో మంచి మంచి అవకాశాలు వచ్చాయని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. అంతేకాదు తాజాగా ఆయన నటించిన ఫ్యామిలీ డ్రామా సిరీస్ గురించి కూడా ఆయన చెప్పుకొచ్చాడు. ఆ సినిమాలో తను సైకోగా నటించడంతో తన భార్య చాలా భయపడిందని

 ఆ పాత్రలో నన్ను నా భార్య చూసి మూడు రోజులు ఇంటికి రానివ్వలేదని.. ఆఫీస్ లోనే పడుకోమని చెప్పింది అంటూ చెప్పుకొచ్చాడు సుహాస్. ఈ సిరీస్ విడుదలైన అనంతరం ఇంట్లో నార్మల్గా నవ్వినా కూడా నా భార్య చాలా భయపడేది అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఈయన చేసిన కామెంట్లు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆయన నటిస్తున్న రైటర్ పద్మభూషణం సినిమా కి సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైంది .ట్రైలర్ విడుదల అనంతరం మంచి ఆదరణ కూడా పొందింది. సుహాస్ హీరోగా నటించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: