రాజమౌళి హీరోగా కొత్త సినిమా.. ఎప్పుడంటే..!?

Anilkumar
ప్రపంచం మొత్తం గర్వించ దగ్గ దర్శకుడు ఎవరు అంటే టక్కున చెప్పే పేరు రాజమౌళి. జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ హీరోలుగా నటించిన త్రిబుల్ ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని ప్రపంచం గర్వించదగ్గ దర్శకుడిగా పేరుపొందాడు దర్శకుడు రాజమౌళి. ఈ సినిమాతో రాజమౌళి సృష్టించిన ప్రభంజనం మరిచిపోలేనిది. బాక్సాఫీస్ పరంగా త్రిబుల్ ఆర్ సినిమా ఎలాంటి అద్భుతాలను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో హిందీ వెర్షన్ లో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. దీంతో ఈ సినిమాని ఇతర దేశాలకు చెందిన మూవీ లవర్స్ కూడా చాలా ఇష్టపడ్డారు. 

ఫలితంగా త్రిబుల్ ఆర్ సినిమాకి హాలీవుడ్ లో వరుస ప్రతిష్టాత్మక అవార్డులు వస్తున్నాయి. ఇప్పటికి ఈ సినిమాకి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ మరియు లాస్ ఏంజిల్స్ ఫిలిం క్రిటిక్స్ అవార్డు సైతం రావడం జరిగింది. త్వరలోనే త్రిబుల్ ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక అలాంటి అద్భుతమైన సినిమాని తెరకెక్కించిన రాజమౌళి.. అవతార్ మరియు టైటానిక్ వంటి సినిమాలను తీసిన జేమ్స్ కెమెరా సైతం మెచ్చుకున్నారు. దర్శకుడిగా ఇండియన్ డైరెక్టర్లలో ఊహించని స్థాయికి వెళ్లిపోయాడు రాజమౌళి. ఇదిలా ఉంటే రాజమౌళి గురించి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.

అది ఏంటి అంటే రాజమౌళి ఇప్పుడు హీరోగా కూడా మనందరికీ కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే రాజమౌళి హీరోగా ఒక డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ తో త్వరలోనే మన ముందుకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ కి సంబంధించిన అప్లాజ్ ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫిలిం కంపానిన్యం సంస్థలు కలిసి మోడరన్ మాస్టర్స్ అని ఒక డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ తీస్తున్నారట. ఇందులో భాగంగానే రాజమౌళి ఇందులో లీడ్ రోల్ లో నటించనున్నాడని.. అంతేకాదు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానందిని తెలుస్తోంది. ఇప్పటివరకు డైరెక్టర్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించిన రాజమౌళి ఇప్పుడు హీరోగా కూడా ఎంట్రీ ఇస్తున్నాడు అన్న వార్త విన్న చాలా మంది ఈయన అభిమానులు తెగసంతోషిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: