రజినీకాంత్ 'జైలర్' విడుదల వాయిదా.. కారణం అదేనా..?

Anilkumar
కోలీవుడ్ సీనియర్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం 'జైలర్'. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా విడుదల తాజాగా వాయిదా పడినట్లు సమాచారం. ముందుగా ఈ సినిమా వేసవి కానుకగా విడుదల అవుతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ రిలీజ్  వాయిదా వేసింది. వేసవి కానుకగా ఏప్రిల్ 14న విడుదల చేయాలనుకున్న ఈ సినిమా విడుదలను ఆగస్టు 11 కు మార్చినట్లు తెలుస్తోంది. ఇక జైలర్ సినిమా విడుదల వాయిదా పడడానికి కారణం 'పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2' సినిమా అని టాక్ వినిపిస్తోంది. 

తమిళ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ సినిమా మొదటి భాగం గత ఏడాది విడుదలై సంచలన విజయాన్ని అందుకోగా.. రెండో భాగాన్ని వేసవి కానుకగా ఏప్రిల్ 28న విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రెండు సినిమాల మధ్య పోటీ ఉండకూడదని జైలర్ మూవీ టీం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఏప్రిల్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా ఆగస్టు కి వాయిదా పడినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇక రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న జైలర్ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తయింది. ఈ సినిమాలో రజనీకాంత్ సరసన తమన్నా కథానాయకగా నటిస్తోంది. 

ఈ సినిమాపై రజనీకాంత్ ఫాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో ఇతర ఇండస్ట్రీలోని అగ్ర నటులు సైతం నటిస్తున్నారు. సినిమాలో రజనీకాంత్ మురిపెన్నడూ కనిపించని సరికొత్త మేకోవర్తో కనిపిస్తారని సమాచారం. ఇక ఈ సినిమాలో మలయాళ అగ్ర నటుడు మోహన్ లాల్ తో పాటు కన్నడ అగ్ర హీరో శివకుమార్ సైతం పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే మన టాలీవుడ్  కమెడియన్ కం విలన్ అయిన సునీల్ ఈ సినిమాలో ఓ విలన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా జైలర్ సినిమా నుంచి సునీల్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై భారీ రెస్పాన్స్ అందుకుంది. కమర్షియల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఇటీవల తలపతి విజయ్తో బీస్ట్ అనే సినిమా తీసి బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని అందుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని అందుకుంటాడో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: