త్రివిక్రమ్ మొదటి సంపాదన ఎంత.. ఏం చేసాడో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ రచయితగా, డైలాగు రైటర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు త్రివిక్రమ్. దాని అనంతరం నెమ్మదిగా డైరెక్టర్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. తర్వాత ఎవరూహించిన విధంగా ఎన్నో సంచలనాలను సృష్టించాడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. నెమ్మదిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాలు చేయాలని చాలామంది స్టార్ హీరోలు సైతం ఎదురుచూస్తూ ఉంటారు. అయితే త్రివిక్రమ్ గురించి చాలామందికి తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి. 

ఇందులో భాగంగానే ఆయన తలకెక్కించిన మొదటి సినిమా ఏది.. ఆ సినిమాకు త్రివిక్రమ్ కి ఇచ్చిన అడ్వాన్స్ ఎంత.. ఆ అడ్వాన్స్ని త్రివిక్రమ్ ఏం చేశాడు.. అన్న ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన మొట్టమొదటి సినిమా నువ్వే నువ్వే. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తరుణ్ హీరోగా నటించిన హీరోయిన్గా శ్రేయ నటించింది. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో స్రవంతి రవి కిషోర్ నిర్మించిన ఈ సినిమా స్రవంతి మూవీస్ పతాకంపై తెరకెక్కింది. కాగా  ఈ సినిమాలో చంద్రమోహన్, రాజీవ్ కనకాల, ప్రకాష్ రాజ్, తనికెళ్ల భరణి, సునీల్ కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా విడుదలై ఇప్పటికే 20 ఏళ్లకు పైగా అవుతుంది.

ఆ సినిమా చేస్తున్న సమయంలో రచయితగా ఉన్న త్రివిక్రమ్ దాని అనంతరం స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు. అయితే త్రివిక్రమ్ దర్శకుడిగా ఈ స్థాయికి రావడానికి ముఖ్య కారణం నిర్మాత రవి కిషోర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులో భాగంగానే త్రివిక్రమ్ చాలాసార్లు ఆయనకి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పిన తక్కువే అని చాలా సందర్భాలలో తెలిపారు. వన మాలి హౌస్ లో నువ్వే కావాలి సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో రవి కిషోర్ త్రివిక్రమ్ చాలా సన్నిహితంగా ఉండేవారు. ఆ సమయంలోనే ఈ సినిమా కథను ఆయనకు వినిపించారట. వెంటనే ఆయన చెక్కు రాసి కొంత అమౌంట్ ని కూడా త్రివిక్రమ్ కి అందజేశారట. అయితే త్రివిక్రమ్ కి రవి కిషోర్ ఇచ్చిన డబ్బుతో త్రివిక్రమ్ మొదటిగా ఒక బైక్ ని తీసుకున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఏదేమైనప్పటికీ త్రివిక్రమ్ మొదటి పారితోషకాన్ని ఖర్చు చేయకుండా ఎప్పటికి గుర్తుండేటట్టు ఒక బైక్ను కొనుగోలు చేయడం పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నేటిజెన్లు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: