ఎన్టీఆర్ చేయాల్సిన ఆ సినిమా మెగాస్టార్ చేతికి వెళ్లిందా..!?

Anilkumar
సాధారణంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక హీరో కోసం అనుకున్న సినిమా అనుకోని కారణాల వల్ల మరో హీరో చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం. ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ ఏ హీరో ఆ సినిమా చేయాలని రాసిపెట్టి ఉంటే ఆ హీరో ఆ సినిమా చేస్తాడు. అయితే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఖైదీ నెంబర్ 150 సినిమా. అయితే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా కంటే ముందే విజయ్ కత్తి సినిమాను తారక్ తో చేయాలని భావించారు. దీనికి సంబంధించిన చర్చలను కూడా జరిపారు. కానీ అది ఎవరూ ఊహించిన విధంగా మెగాస్టార్ చేతికి వెళ్ళింది. అయితే ఈ విషయాన్ని తాజాగా గోపీచంద్ మలినేని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. 

ఇందులో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గోపీచంద్ తమిళంలో కత్తి సినిమా చూసిన తర్వాత తెలుగులో ఎన్టీఆర్ తో ఈ సినిమా రిలీజ్ చేయాలని భావించాను.. అంతేకాదు డైరెక్టర్ మురుగదాస్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాను. ఆయన కూడా బాగుంది అని చెప్పడంతో ఎన్టీఆర్ తో మాట్లాడడం కూడా జరిగింది.. అయితే మేమందరం దీనికి సంబంధించిన విషయాలను చర్చించుకుంటున్న సమయంలో అనూహ్యంగా ఆ కత్తి హక్కుల్ని చిరంజీవి కొనేశారు అన్న వార్త మాకు తెలిసింది.. అయితే ఈ  విషయంలో కాస్త కన్ఫ్యూజన్ వచ్చింది.. మొదట ఈ సినిమా రీమే హక్కుల్ని మేము కొనుగోలు చేసే ప్రయత్నంలో ఉన్న సమయంలో విజయ్ దాన్ని డబ్బింగ్ చేయించి తెలుగులో రిలీజ్ చేయాలని భావించాడు.. ఇక ఆ సమయంలో కాస్త సందిగ్ధం ఏర్పడింది..

ఇందులో భాగంగానే మేము మళ్ళీ రీకనెక్ట్ అయ్యేలోపే ఆ సినిమా హక్కుల్ని మెగాస్టార్ ఉన్నారని తెలిసింది.. అంటూ చెప్పుకొచ్చాడు గోపీచంద్. ఇక కత్తి రీమేక్ క్యాన్సిల్ అవడంతో ఎన్టీఆర్ తో తాను ఇంకో సినిమా చేయాలని భావించాడు అని చెప్పవచ్చాడు గోపీచంద్. దిల్ రాజు నిర్మాణంలో ఒక సినిమా చేయాలని ఎన్టీఆర్ కి ఒక మాస్ కథని కూడా వినిపించాను అని చెప్పుకొచ్చాడు. ఇందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. నేనండి ఇంత మాస్ కదాని అసలు ఊహించలేదు అని.. నేను ఇంత భారీ సినిమాని చేయలేనని కొంత కామెడీ యాంగిల్ ఉంటే బాగుంటుందని అలా ఏమైనా ఉంటే చెప్పమని ఎన్టీఆర్ నాకు చెప్పాడు అని వివరించాడు గోపీచంద్. ఇక అలా రెండుసార్లు ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశాన్ని గోపీచంద్ మిస్ చేసుకున్నట్లు తెలియజేశాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: