డబ్బులిస్తేనే వస్తా అంటున్న మెగాస్టార్..!?

Anilkumar
సంక్రాంతి పండుగ అయిపోయి ఇన్ని రోజులు గడుస్తున్నప్పటికీ మెగాస్టార్ చిరంజీవికి మాత్రం ఇంకా అయిపోలేదు. ఎందుకు అంటే జనవరి 13న ప్రారంభమైన మెగా మాస్ జాతర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఒక సినిమాని ఆదరిస్తే ఆ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్స్ ని రాబడుతుందో వాల్తేరు వీరయ్య సినిమా నిరూపించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఈ సినిమా వారం రోజుల్లోనే 100 కోట్లకు పైగా నీ షేర్ని కొల్లగొట్టింది. ఇంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా సక్సెస్ ని మెగా అభిమానులతో పంచుకోవాలి. ఇక మెగా అభిమానులు సైతం దీన్నే కోరుకుంటున్నారు. 

ఎందుకు అంటే గత సంవత్సరం చిరంజీవి హీరోగా నటించిన సినిమాలు ఇప్పటికే వరుసగా ఫ్లాప్ లో అయిన నేపథ్యం లో ఎంతో నిరాశకి గురైన మెగా అభిమానులు ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఈ సక్సెస్ ని మెగా అభిమానులతో పంచుకోవాలని మెగా అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా విజయాన్ని చిరస్థాయిగా గుర్తించుకోవాలి అంటే కచ్చితంగా ఈ సినిమా సక్సెస్ మీట్ ని మెగా అభిమానులతో జరుపుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ ఆ పనిలోనే పడ్డారు ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ ని కానీ విని ఎరుగని రీతిలో నిర్వహించాలని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి నుండి ఈ సక్సెస్ మీట్ కి సంబంధించిన గ్రీన్ సిగ్నల్ మాత్రం ఇప్పటికీ రాలేదు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ఇంకా ఫైనల్ చేయలేదు.

 అయితే ఇటీవల ఈ సినిమాకి జరిగిన సక్సెస్ మీట్ లో భాగంగా పాల్గొన్నారు.ఆయన మాట్లాడుతున్న సమయంలో ఈ సినిమా నిర్మాతలు త్వరలోనే భారీ స్థాయిలో మరొక సక్సెస్ మీట్ కూడా ఉంటుంది అని చెప్పగానే.. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఇంకెన్నిసార్లు నేను రావాలి.. ఇంకెన్ని సార్లు నాతో మాట్లాడిస్తారు..నేనేమైనా తక్కువగా మాట్లాడానా.. మీరు ఇచ్చే డబ్బులకి ఈ మాత్రం మాట్లాడడమే ఎక్కువ అంటూ.. చెప్పి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. అంతేకాదు ఒక్క పర్సు ఇచ్చి అన్ని కావాలి అంటే ఎలా కుదురుతుంది అంటూ ఉత్తరాంధ్ర స్లాంగ్లో సరదాగా మాట్లాడాడు చిరంజీవి. ఇక ఈ వార్త విన్నానంతరం చాలా మంది మెగా అభిమానులు అయోమయంలో పడ్డారు. నిర్మాతలు నిజంగానే చిరంజీవికి అడిగినంత డబ్బు ఇచ్చి ఈ సక్సెస్ మీట్ కి రప్పిస్తారా.. అన్న అయోమయంలో పడ్డారు. ఆ సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి సరదాగా ఈ వ్యాఖ్యలను చేశారు అన్నది అందరికీ అర్థం అయింది. ఇందులో భాగంగానే తాజాగా మెగా అభిమానులు ఈ విషయాన్ని తమ సోషల్ మీడియా వేదికగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ ని టైప్ చేసి ఈ ప్రశ్నని అడుగుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: