తన ఎనర్జీ సీక్రెట్ ఏంటో.. చెప్పేసిన యాంకర్ సుమ?

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. అయితే కొత్త హీరోయిన్ల రాకతో ఇక సీనియర్ హీరోయిన్లకు అవకాశాలు కాస్త తక్కువ అవుతూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు కనుమరుగు అవటం  లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే అచ్చం బుల్లితెరపై కూడా ఎప్పుడూ ఎంతోమంది యాంకర్లు మారుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే సినిమాల్లో దశాబ్ద కాలం దాటిపోయిన కొంతమంది హీరోయిన్లు హవా చలాయించినట్లుగానే అటు బుల్లితెరపై కూడా దశాబ్ద కాలం దాటిపోయిన ఇంకా టాప్ యాంకర్ గానే హవా చాలా ఇస్తుంది యాంకర్ సుమ.

 యాంకర్ సుమ పేరు వినిపించగానే అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ప్రతి ఒక్క బుల్లితెర ప్రేక్షకుడికి గుర్తుకు వస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను అలరిస్తూ వచ్చింది సుమ. ఇక ఇటీవల సుమ అడ్డ అనే కొత్త కార్యక్రమంతో కూడా అదే రీతిలో ఎంటర్టైన్మెంట్ పంచుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే కేవలం బుల్లితెరపై కార్యక్రమాలు మాత్రమే కాదు.. సినిమా ఈవెంట్లతో కూడా క్షణం కూడా తీరిక లేకుండా బిజీబిజీగా ఉంటుంది సుమ. దీంతో ఇంత బిజీ లైఫ్ ను సుమా ఎలా లీడ్ చేయగలుగుతుంది. సుమ అసలు అలసిపోదా అనే అనుమానం ఎంతో మందిలో కలుగుతూ ఉంటుంది.

 యాంకర్ సుమకి ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది అని కూడా అప్పుడప్పుడు చర్చ జరుగుతూ ఉంటుంది. అయితే ఇటీవల తన ఎనర్జీ సీక్రెట్ ఏంటో చెప్పేసింది యాంకర్ సుమ. తన అమ్మ గురించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ఆమెకు ప్రస్తుతం 80 ఏళ్ల వయసు.. ఈ వయసులో కూడా ఆమె ఇంకా చాలా యాక్టివ్ గా ఉంటుంది. మా అమ్మ ఎనర్జీ నాకు వచ్చింది అంటూ సుమ ఒక కామెంట్ చేసింది. అంతేకాదు ఇటీవల సుమ తన తాత గారిని కూడా చూపించింది. ఆయన వయస్సు 97 ఏళ్లు అయినప్పటికీ ఇంకా హైకోర్టులో అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు అంటూ తెలిపింది సుమ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: