ట్రెడిషనల్ లుక్ లో మైమరపిస్తున్న శ్రీ లీల..!

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చే వారిలో కొంత మంది ముద్దుగుమ్మలు మొట్ట మొదటి మూవీ తోనే అద్భుతమైన క్రేజ్ ను ఎంతో మంది అభిమానుల మనసులు దోచుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో యంగ్ బ్యూటీ శ్రీ లీల ఒకరు. ఈ ముద్దుగుమ్మ రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందD మూవీ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి , తన నటనతో ... డ్యాన్స్ తో ... అందచందాలతో ప్రేక్షకుల మనసును దోచుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తుంది.
 

ఈ ముద్దుగుమ్మ పోయిన సంవత్సరం డిసెంబర్ 23 వ తేదీన విడుదల అయిన ధమాకా మూవీలో హీరోయిన్ గా నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ కి 100 కోట్లకు పైగా కలెక్షన్లు దక్కాయి. రవితేజ ఈ సినిమాలో హీరోగా నటించాడు. ప్రస్తుతం శ్రీ లీల ... రామ్ ..  బోయపాటి కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే నితిన్ ... వక్కంతం వంశీ కాంబినేషన్.లో రూపొందుతున్న సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మహేష్ ... త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ బడ్జెట్ క్రేజీ మూవీ లో కూడా ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గ నటిస్తోంది.
 

ఇలా వరుస మూవీ లతో ఫుల్ జోష్ లో ఉన్న శ్రీ లీల ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా శ్రీ లీల అదిరిపోయే ట్రెడిషనల్ లుక్ లో ఉన్న డ్రెస్ ను ధరించి , తలలో మల్లె పూలను పెట్టుకొని క్యూట్ స్మైల్ తో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలను శ్రీ లీల తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: