100 కోట్ల షేర్ మార్కును టచ్ చేసిన వాల్తేరు వీరయ్య..!
ఈ మూవీ ఇప్పటివరకు 8 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 8 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లను అందుకుందో తెలుసుకుందాం. 8 రోజుల్లో ఈ మూవీ నైజాం ఏరియాలో 27.7 కోట్లు , సీడెడ్ లో 14.87 కోట్లు , యు ఏ లో 12.29 కోట్లు , ఈస్ట్ లో 8.75 కోట్లు , వెస్ట్ లో 4.86 కోట్లు , గుంటూరులో 6.43 కోట్లు , కృష్ణ లో 6.16 సిక్స్ కోట్లు , నెల్లూరు లో 3.18 కోట్లు , కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6.40 కోట్లు , ఓవర్సీస్ లో 11.05 కోట్లు మొత్తంగా ఈ సినిమాకు 8 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 101.16 కోట్ల షేర్ , 173.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు లభించాయి. ఇలా ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల షేర్ మార్క్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోని బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.