HBD: కమెడియన్ నుంచి హీరోగా మారిన సంతానం.. తెలియని విషయాలెన్నో..!

Divya
తమిళ్ సినీ ఇండస్ట్రీలో తన కామెడీ టైమింగ్ తో టాప్ కమెడియన్ గా దూసుకుపోతున్న సంతానం గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . జనవరి 21 1980 న జన్మించిన ఈయన నేడు తన 43వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు ఇకపోతే ఈరోజు ఆయన గురించి తెలియని కొన్ని విషయాలను మనం ఇప్పుడు చదివి తెలుసుకుందాం. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బ్రహ్మానందం ఎంతటి పేరు తెచ్చుకున్నారో..సంతానం కూడా కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హాస్యనటుడిగా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు . గత కొన్ని సంవత్సరాల క్రితం హీరోగా మారి తన లక్ పరీక్షించుకున్నారు.
ఇప్పటికే హీరోగా తమిళంలో వరుస ఆఫర్లను అందుకుంటూ తెగ బిజీగా మారిన సంతానం తమిళంలోనే కాదు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితుడే అని చెప్పవచ్చు.  తెలుగులో డబ్బింగ్ అయినా రాజారాణి , ఓకే ఓకే వంటి సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సొంతం చేసుకున్నాడు. ఇకపోతే 2021లో ఈ స్టార్ కమెడియన్ తెలుగులోకి హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చారు. తాను నటించిన సభాపతి సినిమాను తెలుగులోకి అనువాదం చేసి విడుదల చేయాలని మేకర్స్ 2021లో ఆ సినిమాను రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమాతో  పుగల్ హీరోయిన్ గా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే.. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను పెద్దగా అలరించలేదు. కానీ ఆయనకు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది.
సంతానం ఒక సినిమా హాస్యనటుడు మాత్రమే కాదు నిర్మాత కూడా.. తాజాగా అజిత్ నటిస్తున్న తన 62వ చిత్రంలో కూడా సంతానం కీలకపాత్ర పోషిస్తున్నారు. విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంతానం కీరోల్ ప్లే చేయడానికి ఏకంగా 8 లక్షల రూపాయల పారితోషకం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇకపోతే 2018లో తన నటనకు కలైమామణి అనే గౌరవప్రదమైన పురస్కారం కూడా సొంతం చేసుకున్నారు.  ఉష అనే అమ్మాయిని వివాహం చేసుకోగా ఈయనకు ఇప్పుడు ముగ్గురు పిల్లలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

HBD

సంబంధిత వార్తలు: