రవితేజ అభిమానులకు శుభవార్త.. మిరపకాయ రీ రిలీజ్..!

Divya
క్రాక్ సినిమాతో మళ్ళీ లైన్లోకి వచ్చిన మాస్ మహారాజా రవితేజ గత ఏడాది నటించిన రెండు మూడు సినిమాలు భారీ ఫ్లాప్ ను అందించాయి. దీంతో ఎలాగైనా సరే విజయం సాధించాలని పట్టుబట్టి మరి ధమాకా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఊహించని స్థాయిలో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా రవితేజ సినీ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది ఈ సినిమా.
త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో శ్రీ లీలా హీరోయిన్గా తెరకెక్కిన ఈ చిత్రంలో మాస్ మహారాజ మరొకసారి తన మార్క్ చూపించారు.
ఇక ఈ సినిమాతో విజయం సాధించిన రవితేజ ఇటీవల చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా ముఖ్య అతిథి పాత్రలో నటించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం రీ రిలీజ్ సినిమాల హవా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు, ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల బ్లాక్ బాస్టర్ సినిమాలను ఒక్కొక్కటిగా రీ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే మాస్ మహారాజా రవితేజ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచిన మిరపకాయ్ సినిమాను రిలీజ్ చేయడానికి నిర్మాతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఒకవైపు రిపబ్లిక్ డే మరొకవైపు ఆయన పుట్టినరోజు కావడంతో జనవరి 26వ తేదీన మిరపకాయ్ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఎల్లో ఫ్లవర్స్ పతాకం పై పుష్పాల రమేష్ నిర్మించిన చిత్రం ఇది. ఇందులో రవితేజ హీరోగా రిచా గంగోపాధ్యాయ, దీక్ష సేథ్ హీరోయిన్లుగా .. నాగబాబు, ప్రకాష్ రాజ్ , రావు రమేష్ , సునీల్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించడం జరిగింది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందించారు జనవరి 13 2011 న విడుదలై ఘన విజయం సాధించిన ఈ సినిమాను ఇప్పుడు రవితేజ పుట్టినరోజు సందర్భంగా జనవరి 26వ తేదీన రీ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: