బ్రేక్ ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న వాల్తేరు వీరయ్య... ఎన్ని కోట్ల కలెక్షన్లను సాధించిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి తాజాగా వాల్తేరు వీరయ్య అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. శృతి హాసన్ ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్గా నటించగా ,  బాబీ సింహ , ప్రకాష్ రాజ్ ఈ మూవీ లో విలన్ పాత్రలలో నటించారు. రవితేజ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించగా , కేథరిన్ ఈ సినిమాలో రవితేజ కు భార్య పాత్రలో నటించింది. శ్రీనివాస్ రెడ్డి , షకలక శంకర్ ఈ మూవీ లో నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీvని మైత్రి సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది.

ఈ సినిమాను ఈ సంవత్సరం జనవరి 13 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేశారు. ఈ మూవీ విడుదలకు ముందు నుండి ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు , పాటలు , ట్రైలర్ అద్భుతంగా ఉండడం , అలాగే చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి ... రవితేజ కలిసి ఈ సినిమాలో నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ప్రేక్షకుల్లో నెలకొన్నాయి. దానితో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 88 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

అలా భారీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న ఈ సినిమా 89 కోట్ల భారీ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ రావడంతో ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు లభిస్తున్నాయి. ఇప్పటివరకు 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా 7  రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 91.41 కోట్ల షేర్ ... 157.15 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి హిట్ స్టేటస్ ను అందుకొని 2.41 కోట్ల లాభాలను కూడా అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: