వామ్మో.. వాల్తేరు వీరయ్య కోసం చిరు, రవితేజ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా మొదటి మూడు రోజుల్లోనే 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాలో చిరంజీవి రవితేజ తమ అద్భుత నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. బాబి కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. శృతిహాసన్ తో పాటు ఈ సినిమాలో కేథరిన్ మరియు ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటించారు. ఇక రవితేజ ఈ సినిమాలో ACP విక్రమ్ సాగర్ గా రవితేజ మరియు మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాకి గాను భారీ పారితోషకాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 

ఇకపోతే ఈ సినిమాలో చిరంజీవి సోదరుడి పాత్రలో ఏసిపి విక్రమ్ సాగర్ పాత్రలో నటించి నందుకుగాను రవితేజ ఏకంగా 17 కోట్ల రెమ్యూనరేషన్ను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన చిరంజీవి ఈ సినిమాకి గాను ఏకంగా 50 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకున్నారట. ఇక చిరంజీవి కెరియర్ లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఇది కాగా  ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కి జోడిగా ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన శృతిహాసన్ ఈ సినిమాలో ఏజెంట్ పాత్రలో మెప్పించింది. ఇందుకుగాను శృతిహాసన్ దాదాపు 2.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

కాగా ఈ సినిమాలో ఏసీబీ పాత్రలో నటించిన రవితేజ భార్య పాత్రలో నటించిన 75 లక్షల రూపాయల పారితోషకాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ఒక కీలక పాత్రను నటించడం జరిగింది. ఈయన ఈ సినిమాకి గాను 40 లక్షల రూపాయల పారితోషకాన్ని తీసుకున్నాడు. ఆయనతోపాటు ఈ సినిమాలో కీలక పాత్రలో విలన్ గా నటించిన ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో విలన్ గా నటించేందుకు ఏకంగా ఒకటి పాయింట్ ఐదు కోట్లను తీసుకున్నట్లుగా సమాచారం. ఒక స్పెషల్ సాంగ్ లో నటించిన ఊర్వశి రౌటెల ఒక్క పాట కోసం ఏకంగా రెండు కోట్లు రెమ్యూనరేషన్ను తీసుకున్నట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: