అల్లు అర్జున్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన చిరంజీవి..!?

Anilkumar
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీర సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా ఈనెల సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.మాస్  యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా ఎవరు ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకొని ఒక్కసారిగా అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జోడిగా శృతిహాసన్ నటించిన.. వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు మాస్ మహారాజ రవితేజ కూడా ఒక కీలక పాత్రలో నటించిన సంగతి మన అందరికీ తెలిసిందే. 

అయితే ఇందులో భాగంగానే ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ నిర్వహించారు చిత్ర బంధం. ఇక ఈ నేపథ్యంలో ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు చిత్ర బృందం.  ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలను చేయడం జరిగింది. ఇందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ.. బన్నీ స్టార్ హీరోగా వేయడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చారు. అంతేకాదు వాల్తేరు వీరయ్య సినిమా విజయం సమిష్టి అని ఈ సినిమా కోసం ప్రతి ఒక్క టెక్నీషియన్ ,నటినటులు రాత్రింబవళ్లు కష్టపడ్డారు అని చెప్పకు వచ్చారు.

అనంతరం అనంతరం  బన్నీ గురించి మాట్లాడుతూ.. బన్నీ ఎదుగుతున్న విధానాన్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అని.. మొదటినుండి ఎంతో కష్టపడుతున్న బన్నీ  పుష్పా సినిమాతో ఐకాన్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్ గా మంచి క్రేజ్  ని అందుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది అని.. రాబోయే రోజుల్లో తప్పకుండా మరింత ఉన్నత స్థాయికి బన్నీ ఎదుగుతాడు అని.. నా ఆశీస్సులు బన్నీకి ఎప్పుడూ ఉంటాయి.. అంటూ చెప్పుకొచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సీక్వెల్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమాలో బన్నీకి జోడిగా రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది. అంతేకాకుండా వీరితోపాటు ఈ సినిమాలో సాహద్ ఫాజల్, సునీల్ ,అనసూయ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం బన్నీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: