మహేష్ సినిమాలో ఫిక్స్ అయిన హీరోయిన్.. ఎవరో తెలుసా..!?

Anilkumar
గత కొంతకాలంగా మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీ లీల ఉందా లేదా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.ఇక ఈ విషయానికి గాను గత కొన్ని నెలలుగా సోషల్ మీడియా వేదికగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా శ్రీ లీల ఈ సినిమాలో ఉంది అన్న క్లారిటీ రావడం జరిగింది. అయినప్పటికీ మహేష్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో శ్రీల ఉందా లేదా అన్న వార్తపై పుకార్లు మాత్రం ఇప్పటికీ ఆగడం లేదు. అయితే తాజాగా ఈ పుకార్లకు చెక్ పెట్టింది చిత్ర బృందం. ఈ సినిమాలో శ్రీ లీలా ఖచ్చితంగా ఉంది అంటూ క్లారిటీ ఇచ్చారు చిత్ర బంధం. 

అయితే త్రివిక్రమ్ మరియు మహేష్ బాబు కాంబినేషన్ లో రానున్న సినిమాలో మహేష్ బాబు కి జోడిగా అంటే ఫస్ట్ హీరోయిన్గా పూజ హెగ్డే ఇప్పటికే ఫిక్స్ అయింది. ఇక సెకండ్ హీరోయిన్ గా శ్రీ లీలను ఫిక్స్ చేశారు చిత్రబంధం. ఇక ఈ విషయాన్ని స్వయంగా ఈ సినిమా నిర్మాత నాగ వంశీ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ ను కూడా చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ సినిమాని ఆగస్టు 11న రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లుగా కూడా ఈ సినిమా నిర్మాత నాగ వంశీ చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగానే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ 18వ తేదీ నుండి ప్రారంభం కానుంది అని కూడా తెలిపారు.

ఈ  సినిమాకి మహేష్ బాబు బల్క్ కాల్షీట్స్ కేటాయించడం జరిగింది. ఇక ఈ సినిమా కోసం ఇప్పటికే మూడు భారీ సెట్లను సిద్ధం కూడా చేశారు.  18వ తేదీ నుండి నాన్ స్టాప్ గా ఈ సినిమా షూటింగ్ను చేస్తామని తెలిపారు. కాగా మహేష్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఫిక్సయిన శ్రీ లీల  ప్రస్తుతం టాలీవుడ్ ని ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్గా కొనసాగుతుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది ఈ అమ్మడు. తాజాగా మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అరడజనికి పైగానే సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. ఇలాంటి సమయంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో ఆఫర్ను కొట్టేసింది శ్రీ లీల..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: