ఒక్క మాటతో.. యాంకర్ సుమ పరువు తీసేసిన శేఖర్ మాస్టర్?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బుల్లితెర కార్యక్రమాల హవా ఎంతల నడుస్తూ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ఎన్నో బుల్లితెర కార్యక్రమాలు ప్రేక్షకులను అలరిస్తూ అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల కాలంలో తెలుగు బుల్లితెర  పై టాప్ యాంకర్ గా కొనసాగుతున్న సుమా ఎన్నో బుల్లితెర కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరిస్తుంది. మరోవైపు సినిమా ఈవెంట్లతో కూడా బిజీబిజీగా మారిపోయింది.. అయితే సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించే క్యాష్ షో ఇటీవల ఆగిపోయింది అని చెప్పాలి.

 ఒక షోలో భాగంగా ఇక సుమా కొన్నాళ్ళు బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నాను అంటూ ఎమోషనల్ కావడంతో యాంకరింగ్ కి సుమా దూరమవుతుందని అందరూ అనుకున్నారు. కానీ సుమా అడ్డ అనే కొత్త షో తో మళ్ళీ తెరమీదకి వచ్చి సరికొత్తగా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచుతుంది. ఇక ఈ షోలో భాగంగా మొదటి ఎపిసోడ్లో ఇక వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ కోసం మెగాస్టార్ చిరంజీవి రావడంతో ఒక్కసారిగా హైలైట్ అయింది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల టాలీవుడ్ లోనే కాదు సౌత్ ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఇద్దరు కూడా సుమా అడ్డా అనే కార్యక్రమానికి గెస్ట్లుగా వచ్చారు.

 ఈ క్రమంలోనే ఇద్దరు కూడా తమదైన శైలిలో ఎంటర్టైన్మెంట్ పంచారు అని చెప్పాలి. ఇలాంటి సమయంలోనే ఇక శేఖర్ మాస్టర్ ఒక్క మాటతో యాంకర్ సుమ పరువు మొత్తం తీసేసాడు. ఈ మధ్యకాలంలో శేఖర్ మాస్టర్ హీరోయిన్లతో ఎక్కువ వర్క్ చేస్తున్నాడు అంటూ సుమ అనగానే మీరు కూడా హీరోయిన్ కదా అని అంటాడు శేఖర్ మాస్టర్. అవును అందరూ మర్చిపోతున్నారని ఈమధ్య ఒక సినిమా చేశాను అంటూ సుమా అంటుంది. నిజంగానే సినిమా చేశారా ఎప్పుడు.. రిలీజ్ అయిందా.. నాకైతే నిజంగా తెలియదు అంటూ సుమా చేసిన జయమ్మ పంచాయతీ గురించి తెలియదని చెప్పి సుమా పరువు తీసేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: