చిరంజీవి సినిమాను చంపేయడానికి కారణం అదేనా..?

Divya
మెగాస్టార్ చిరంజీవి తాజాగా బాబి కొల్లి దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య సినిమాను సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13వ తేదీన రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఒక్కరోజు తేడాతో జనవరి 12వ తేదీన బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాను విడుదల చేసిన విషయం తెలిసిందే . ఇకపోతే వీరసింహారెడ్డి మాస్, యాక్షన్ పరంగా ప్రేక్షకులను మెప్పించినప్పటికీ ఎమోషనల్ పరంగా ఆకట్టుకోలేదని నెగిటివ్ టాక్ కూడా వచ్చింది. కానీ బాలయ్య మీద ఉన్న అభిమానంతో ఎక్కువగా ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూస్తుండడంతో మొదటి రోజు రూ.54 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి అరుదైన రికార్డు సృష్టించింది ఈ సినిమా. అంతే కాదు బాలయ్య సినీ కెరియర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కాబోతోంది అని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కథ, కథాంశం బట్టి చూస్తే వీర సింహారెడ్డి సినిమా కంటే వాల్తేరు వీరయ్య సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.  మొదటి భాగం అంతా మంచి కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా రెండవ భాగంలో రవితేజ ఎంట్రీ తర్వాత కథ మొత్తం మారిపోయింది.  ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఆకట్టుకుంది. ఒక నిజాయితీగల పోలీస్ ఆఫీసర్ కి దక్కాల్సిన గౌరవం కోసం పోరాడే ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది . ముఖ్యంగా డ్రగ్స్ మాఫియాను అంతమొందించే ప్రయత్నంలో చిరంజీవి తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. పూర్తిస్థాయిలో ఫుల్ లెంగ్త్ మాస్ మసాలా అందించారు అని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇదిలా వుండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీర సింహారెడ్డి కన్నా వాల్తేరు వీరయ్య సినిమా బాగున్నప్పటికీ కుల ఆధారిత వెబ్ సైట్ లు వీర సింహారెడ్డి కోసం వాల్తేరు వీరయ్యను చంపడానికి ప్రయత్నిస్తున్నాయి అనే వార్తలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. అంతేకాదు కులాన్ని బట్టి ఇలా సినిమా కథ, కథాంశంతో తేడా లేకుండా సక్సెస్ చేస్తుండడంతో మరోవైపు చిరు అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ రెండు సినిమాలలో ఏది విజయం సాధించిందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: