మార్వెల్ లో ఎన్టీఆర్ కి ఇష్టమైన క్యారెక్టర్ ఏంటో తెలుసా..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన నటించిన త్రిబుల్ ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అంతేకాకుండా పాన్ ఇండియా గుర్తింపును కూడా పొందాడు. నిన్న మొన్నటి వరకు ఎన్టీఆర్ అంటే టాలీవుడ్ స్టార్ హీరో మాత్రమే. కానీ ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు ఎన్టీఆర్. త్రిబుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకి ఆయన డాన్స్ కి ప్రపంచమంతా షాక్ అయ్యింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

 ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా నటించడం జరిగింది. ఈ సినిమాలో కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటించడం జరిగింది.ఈ సినిమాకి గాను ఎన్నో అవార్డులో కూడా వచ్చాయి. 400 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఎవరు ఊహించిన విధంగా 1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. హాలీవుడ్ ఫిలిం మేకర్స్ సైతం తెలుగు డైరెక్టర్ రాజమౌళి పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక తాజాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డు సైతం సొంతం చేసుకుంది ఈ సినిమా. ఇక ఇటీవల అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో జరిగిన 8 గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుకలో

 బెస్ట్ ఒరిజినల్ నాన్ ఇంగ్లీష్ కేటగిరిలో త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకి గాను ఈ అవార్డు దక్కింది. ఇక ఈ అవార్డుని ఎం ఎం కీరవాణి అందుకోవడం జరిగింది. సినీ మరియు రాజకీయ ప్రముఖులు సైతం ఇందుకుగాను చాలా గర్విస్తున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఈ వేడుక సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఈ అవార్డును అందుకోవడం పట్ల ఆయన అభిప్రాయాన్ని తెలియజేశారు జూనియర్ ఎన్టీఆర్. అయితే ఈ క్రమంలోని మార్వెల్ గురించి మాట్లాడుతూ.. నాకు కూడా మార్వెల్ చేయాలని ఉంది.. నా అభిమానులు కూడా దీని కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. ఇక నాకు ఐరన్ మాన్ అంటే ఇష్టమని... అలాంటి క్యారెక్టర్ వస్తే ఖచ్చితంగా చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు జూనియర్ ఎన్టీఆర్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: