లవ్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన ఐశ్వర్య లక్ష్మీ..!

Divya
తాజాగా తెలుగులో మట్టి కుస్తీ పేరిట రిలీజ్ అయిన సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ ఖైదీ, విక్రమ్, మాస్టర్ వంటి సినిమాలలో విలన్ క్యారెక్టర్ లో నటించిన అర్జున్ దాస్ తో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించింది. తాజాగా గత కొద్ది రోజుల క్రితం మీడియాతో మాట్లాడిన ఐశ్వర్య లక్ష్మి మీకు ప్రేమ పెళ్లి ఇష్టమా? పెద్దలు కుదిరిచిన పెళ్లి ఇష్టమా? అని అడిగితే అసలు తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. కానీ అలా చెప్పి రోజులు కూడా గడవకముందే ప్రముఖ విలన్ గా గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ దాస్ తో క్లోజ్ గా ఉన్న ఒక ఫోటోను షేర్ చేసింది.
అంతటితో ఆగకుండా రెడ్ లవ్ ఏమోజీ ని షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.  దీంతో వీరిద్దరూ నిజంగానే లవ్ లో ఉన్నారు అంటూ వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ఇకపోతే ఐశ్వర్య లక్ష్మి..  అర్జున్ దాస్ తో ప్రేమలో పడింది.. అందుకు నిదర్శనం ఇదే అంటూ.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ రకరకాలుగా వార్తలు వినిపించాయి. అయితే నిన్న ఒక్కరోజులో వచ్చిన వార్తలు చివరికి ఆమె వరకు చేరడంతో వెంటనే స్పందించి పుకార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది ఐశ్వర్య లక్ష్మి.
ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ...  అర్జున్ దాసుతో తాను ప్రేమలో లేను అని క్లారిటీ ఇచ్చింది..తాను అర్జున్ దాస్ తో డేటింగ్ చేయడం లేదు అని కేవలం మా క్లోజప్ పిక్ స్నేహపూర్వకంగా మాత్రమే తీయబడింది అని స్పష్టం చేసింది. మొత్తానికి అయితే ఐశ్వర్య లక్ష్మి తనపై వస్తున్న డేటింగ్ పుకార్లకు ఈ విధంగా స్పందించి చెక్ పెట్టింది అని చెప్పవచ్చు. మరి ఈ ముద్దుగుమ్మ చెప్పినట్టుగానే పెళ్లికి దూరంగా ఉండబోతుందా?  లేక మనసుకు నచ్చిన వాడు దొరికితే వివాహం చేసుకుంటుందా ? అనే సందేహాలు  కూడా ఇప్పుడు వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: