నా అభిమానే.. నాపై విష ప్రయోగం చేశాడు : చిరంజీవి

praveen
మెగాస్టార్ చిరంజీవి అంటే అందరిలా ఒక సాదాసీదా హీరో కాదు . ఆయన ఒక మహా వృక్షం అని చెబుతూ ఉంటారు సినీ విశ్లేషకులు. ఎందుకంటే ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి పరిచయమైన మెగాస్టార్ చిరంజీవి తన నటనతో తన డాన్సులతో సరికొత్త ట్రెండ్ సృష్టించాడు. మూడు దశాబ్దాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీకి నెంబర్వన్ హీరోగా హవా నడిపించాడు. అంతేకాదు ఇక ఇప్పుడు మెగా అనే ఒక పెద్ద ట్యాగ్ ను క్రియేట్ చేసి తన ఫ్యామిలీకి సంబంధించిన ఎంతో మంది కుర్రాళ్లను ఇండస్ట్రీకి హీరోలుగా పరిచయం అయ్యేలా చేశాడు.

 అయితే 60 ఏళ్లు దాటిపోయిన తర్వాత కూడా ఇంకా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇంకా తనలో గ్రేస్ తగ్గలేదు అన్నట్లుగానే డాన్సులతో అదరగొడుతున్నాడు అని చెప్పాలి. అంతేకాదు ఇక ఇండస్ట్రీలోకి రావాలనుకునే ఎంతోమందికి ప్రస్తుతం చిరంజీవి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాడు. ఇక చిరంజీవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇకపోతే చిరంజీవి ఇటీవలే నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అన్న విషయం తెలిసిందే.

 ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో ప్రస్తుతం చిత్ర బృందం బిజీబిజీగా ఉంది. కాగా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు చిరంజీవి. ఏకంగా తనకు వీరాభిమాని అయిన ఒక వ్యక్తి తనపై విష ప్రయోగం చేయడానికి ప్రయత్నించాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఒక సినిమా షూటింగ్ సమయంలో ఒక అభిమాని తన దగ్గరికి వచ్చి తన పుట్టినరోజున నా సమక్షంలో కేక్ కట్ చేశాడు. అయితే నేను ఎప్పుడైనా స్పూన్ తోనే కేక్ తింటాను. కానీ అభిమాని మాత్రం బలవంతంగా నా నోట్లో కేక్ పెట్టాడు. కానీ కేక్ చేదుగా ఉండడంతో ఉమ్మేసాను. తర్వాత కేక్ లో ఏదో కలిపారు అన్న అనుమానం రావడంతో అతని పట్టుకుని రెండు వాయిస్తే అప్పుడు నిజం చెప్పాడు. చాలా రోజుల నుంచి తనను నేను పట్టించుకోవడంలేదని.. కేరళ వెళ్లి ఏదో పౌడర్ తీసుకువచ్చి తనపై వశీకరణ చేయాలని ప్రయత్నించాడట. ఇక తనపై ఉన్న పిచ్చి అభిమానంతోనే ఇలా చేశాడు అన్న విషయం తెలుసుకుని ఇక అతను క్షమించి వదిలేసాను అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: