రామ్ చరణ్ చేతుల మీదుగా అహింస ట్రైలర్ లాంచ్..!

Divya
దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో జనరేషన్ హీరోలలో దగ్గుబాటి అభిరామ్ కూడా ఒకరు.. దగ్గుబాటి రానా తమ్ముడిగా.. దగ్గుబాటి అభిరామ్ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. దర్శకుడు తేజ అభిరామ్ ను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడు. ఈ క్రమంలోనే అహింస సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు అభిరామ్. అయితే ఎప్పుడో మొదలైన ఈ సినిమా.. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుని.. విడుదలకు సిద్ధమవుతోంది ఈ క్రమంలోనే ప్రమోషన్స్ కూడా చేపట్టారు చిత్రం బృందం..
ప్రమోషన్స్ లో భాగంగా సినిమా టీజర్ ను రిలీజ్ చేసి ఆడియన్స్ ను ఇంప్రెస్ చేయగా..  ఇప్పుడు ప్రమోషన్స్ లో మరింత జోరు పెంచే విధంగా రామ్ చరణ్ ని రంగంలోకి దించారు.  అహింస ట్రైలర్ ని రామ్ చరణ్ జనవరి 12న అంటే ఈరోజు ఉదయం 11:07 గంటలకు లాంచ్ చేయబోతున్నారు.  ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ సురేష్ ప్రొడక్షన్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఒక పోస్ట్ రూపంలో షేర్ చేసింది.  మరి ఈ ట్రైలర్ సినిమాపై ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుంది అనేది ప్రస్తుతం అందరిలో ఆసక్తి నెలకొంది.

ఇప్పటికే అభిరామ్ పైన శ్రీ రెడ్డి లాంటి వారు రకరకాలుగా సంచలనం కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి  అపవాదాలను నెట్టుకొని వచ్చి అభిరామ్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. నిజానికి కొత్త వాళ్లతో సినిమా చేసిన సమయంలో దర్శకుడు తేజ చాలా గొప్పగా ఆలోచించి వారిలో ఉన్న యాక్టింగ్ టాలెంట్ ను బయటకు తీసే ప్రయత్నం చేస్తూ ఉంటారు.  ఈ క్రమంలోనే తేజాతో పని చేసిన ప్రతి ఒక్క హీరో కూడా మంచి విజయాన్ని అందుకున్నాడు. ముఖ్యంగా తనకు కావాల్సిన ఎమోషన్ ని ఆర్టిస్టు నుంచి తీసుకోవడంలో తేజ దిట్ట కాబట్టి అతను ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళకి మంచి పేరు వస్తుంది.  ఈ క్రమంలోని అభిరామ్ ను  కూడా తేజ అలాగే తీర్చిదిద్ది ఉంటాడు అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: