హాలీవుడ్ లో బంపర్ ఆఫర్ కొట్టేసిన రామ్ చరణ్.. ఏకంగా అలాంటి పాత్రలో..!?

Anilkumar
గతేడాది  విడుదలైన త్రిబుల్ ఆర్ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే.ఈ సినిమాతో ఈ సినిమా డైరెక్టర్ అయిన రాజమౌళి మరియు ఈ సినిమాలో హీరోలుగా నటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లకి ఈ సినిమాతో పాన్ ఇండియాలో క్రిస్ కూడా దక్కింది.ఇక ఈ సినిమా ఓటిటి లోకి వచ్చిన అనంతరం ఇంటర్నేషనల్ గుర్తింపును కూడా పొందింది. ఇక ఈ సినిమా వచ్చిన అనంతరం హాలీవుడ్ కి సంబంధించిన చాలామంది టెక్నీషియన్లు , క్రిటిక్స్ మరియు హాలీవుడ్ నటులు సైతం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.

అయితే తాజాగా ఈ సినిమా జపాన్లో కూడా విడుదలైంది. విడుదలై 80 రోజులు కావస్తున్నప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్ తో ముందుకు వెళుతుంది.ఇటీవల ఈ సినిమా అంతర్జాతీయ అవార్డ్స్ కి కూడా ఎంపికైంది. అయితే ఈ సినిమాతో రామ్ చరణ్ కి ఎన్టీఆర్ కంటే కాస్త ఎక్కువ గుర్తింపే దక్కింది.ఈ సినిమాతో రామ్ చరణ్ కి ప్రస్తుతం హాలీవుడ్ లో కూడా నటించే అవకాశాలు వస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ త్వరలోనే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వనట్లుగా సమాచారం. అయితే తాజాగా హాలీవుడ్ మీడియాతో ముచ్చటించాడు రామ్ చరణ్.

ఇందులో భాగంగానే హాలీవుడ్ సినిమాల్లో నటించే అవకాశం వస్తే ఏం చేస్తారు అని అడగగా..త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత హాలీవుడ్ నుండి చాలా ఆఫర్స్ రావడం జరిగింది.. చాలా రకాల ఆఫర్స్ వస్తున్నప్పటికీ మంచి కథ కోసం వెయిట్ చేస్తున్నాను.. కద నచ్చితే కచ్చితంగా సినిమాలు చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు రామ్ చరణ్. దీని అనంతరం ఒకవేళ మీకు మార్వెల్ మూవీస్ లో సూపర్ హీరో పాత్ర చేసే అవకాశం వస్తే ఏం చేస్తారు అని అడగగా.. నేను ఐరన్ మాన్ పాత్ర చేస్తాను అంటూ చెప్పుకోవచ్చు రామ్ చరణ్. అయితే గత కొంతకాలంగా రామ్ చరణ్ కి మార్వెల్ స్టూడియోస్ లో ఒక పాత్ర కోసం ఒప్పందం కూడా ఇప్పటికే అయింది అని వార్తలో వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.. దీంతో ఈ వార్త విన్న చాలా మంది ఆ ఒప్పందం గురించి రాంచరణ్ ఇప్పుడు పరోక్షంగా హిట్ ఇచ్చాడు అని అంటున్నారు ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: