బ్రేకప్ అయినా దీప్తి కోసం ఎదురుచూస్తున్న షన్ను..!?

Anilkumar
సోషల్ మీడియా ద్వారా తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దీప్తి సునయన మరియు షన్ను ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బిగ్ బాస్ సీజన్ 5 నుండి బయటకు వచ్చిన అనంతరం దీప్తి షణ్ముఖి బ్రేకప్ చెప్పిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే గతంలో వీరిద్దరికీ బ్రేకప్ కావడంతో వీరిద్దరి బ్రేకప్ కి కారణం సిరి అని రకరకాల వార్తలు సోషల్ మీడియా ద్వారా వచ్చిన సంగతి మనందరికీ తెలుసు. అయితే బిగ్బాస్ హౌస్లో షణ్ముఖ్ తో పాటు తన స్నేహితురాలు సిరి కూడా ఉంది. వారిద్దరూ కలిసి చేసిన రొమాన్స్ అంతా ఇంతా కాదు. 

అయితే వీరిద్దరూ ఇంత సన్నిహితంగా ఉండడం వల్ల హద్దులు మీరు ఈ ప్రవర్తించడం వల్ల దీప్తి సునైనా షణ్ముక్ కి బ్రేకప్ చెప్పింది అని రకరకాల వార్తలు వచ్చాయి. ఇక తమ సోషల్ మీడియా వేదిక ద్వారా తన దారులు వీరిని ఇప్పటికైనా కెరియర్ పై దృష్టి పెట్టాలనుకుంటున్నాను అని చెప్పి మేమిద్దరం విడిపోతున్నాము అని స్పష్టం చేసింది దీప్తి. ఇక దాని అనంతరం వీరిద్దరూ జంటగా ఎక్కడా కూడా కనిపించడం లేదు. అయితే ఆ మధ్య ఒక అవార్డు ఫంక్షన్ లో వీరిద్దరూ కలిసి కనిపించారు. అయితే తాజాగా ఒక ఇంటిని కూడా కొనుగోలు చేసింది దీప్తి సునయన .

ఇటీవల తల్లిదండ్రులతో కలిసి గృహప్రవేశం కూడా చేసింది .అయితే బ్రేకప్ అయ్యి ఇన్నాళ్లు అవుతున్నప్పటికీ వీరిద్దరూ కలిసి ఎక్కడ కనిపించలేదు. దీంతో వీరిద్దరూ సీరియస్ గానే ఉన్నారని తెలుస్తోంది. అయితే ఇవాళ దీప్తి సునైనా బర్త్ డే.  ఈ సందర్భంగా తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టును షేర్ చేయడం జరిగింది. ఇక షణ్ముక్ షేర్ చేసిన ఆ పోస్ట్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. హ్యాపీ బర్త్డే డి అని షణ్ముక్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ను షేర్ చేశాడు. అయితే డి అంటే దీప్తి సునయన అని అర్థం చాలామంది ఇది అర్థం చేసుకునే ఉంటారు. అయితే ఇది చూసిన చాలామంది డైరెక్ట్ గా దీప్తి సునైనా అని పోస్ట్ షేర్ చేయొచ్చు కదా ఎందుకు డి అని మాత్రమే షేర్ చేశాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.  ఇక ఈ పోస్ట్ ని దీప్తి సునైనా చూసి ఎలా స్పందిస్తుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: