మొదటి సారి పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన బిగ్ బాస్ సిరి..!?

Anilkumar
బిగ్ బాస్ షో తో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సిరి శ్రీహాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ జోడి గతంలో యూట్యూబ్లో అందరిని మెప్పించింది. అయితే గతంలో సిరి  బిగ్ బాస్ లో ఉన్న సమయంలో శ్రీహన్ బయట నుండి సిరికి ఎంతగా సపోర్ట్ అందించాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక యూట్యూబర్ షన్నుతో కలిసి సిరి బిగ్ బాస్ హౌస్ లో ఎన్ని పిచ్చి వేషాలు వేసిందో మనందరికీ తెలిసిందే. ఇక దాన్ని కూడా ఎప్పుడూ తప్పు అని చెప్పలేదు శ్రీహన్. అది తప్పు ఇది తప్పు అని ఎప్పుడు సిరికి చెప్పలేదు. ప్రేమతోనే నిన్ను స్వీకరిస్తా ఎప్పుడూ నీ పక్కనే ఉంటా అంటూ శ్రీహాన్ అప్పట్లో బిగ్ బాస్ స్పీచ్ పై చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. 

అలా ఐదవ సీజన్లో సిరి కోసం బిగ్బాస్ తేజ్ మీదకు వచ్చిన శ్రీహన్ ఆరవ సీజన్లో ఏకంగా కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి ఒకసారి అందరిని ఆశ్చర్యపరిచాడు. అయితే శ్రీహాన్ కి ఈ షో లో కాస్త నెగిటివిటీ వచ్చినప్పటికీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్  అందుకున్నాడు.ఇక బయట నుండి శ్రీహానికి ఎంతటి సపోర్టుని అందించిందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ సీజన్ విన్నర్ అవ్వాలని శ్రీహన్ చాలా కష్టపడ్డాడు. ఈ నేపథ్యంలోనే శ్రీహాన్నో కలవడానికి బిగ్బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సిరి రొమాన్స్ చూడలేక పోయారో చాలామంది జనాలు.ఇక ఇందులో భాగంగానే శ్రీహాన్ కోసం టాటూ కూడా వేయించుకుంది సిరి.

ఇంట్లో వెళ్లిన అనంతరం శ్రీహాన్ కి లిప్ లాక్ కూడా ఇచ్చింది సిరి దీంతో ఈ సీజన్లో వీరిద్దరి రొమాన్స్ చాలామందిని ఆకట్టుకుంది అని చెప్పాలి. బయటకు వచ్చిన అనంతరం వీరిద్దరి క్రేజ్ మరింత పెరిగిపోయింది. అయితే ప్రస్తుతం శ్రీ శ్రీహన్లో ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. శేఖర్ మాస్టర్ నిర్మాతగా వీరిద్దరి కాంబినేషన్లో ఈ వెబ్ సిరీస్ రానంది. అయితే తాజాగా సిరి తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఇందులో భాగంగానే ఒక నిటిజన్ పెళ్లెప్పుడు చేసుకుంటారు మీరు శ్రీకాంత్ త్వరగా పెళ్లి చేసుకోండి మాకు చూడాలని ఉంది అని అడిగారు. ఇక దానికి సిరి సమాధానం చెబుతూ త్వరలోనే చేసుకుంటాము అని చెప్పింది. చేసుకుంటాం కానీ ఎప్పుడు చేసుకుంటావో మాత్రం క్లారిటీ లేదు అంటూ చెప్పుకొచ్చింది సిరి. అంటే ఈ  ఏడాదిలో వీరిద్దరూ పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: