ఇండియాలో హైయెస్ట్ గ్రాసర్ హాలీవుడ్ మూవీగా నిలిచిన అవతార్ 2..!

Pulgam Srinivas
ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన టాలెంట్ ఉన్న దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జామ్స్ కామరూన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గతంలో టైటానిక్ ... అవతార్ వంటి భారీ బ్లాక్ బస్టర్ మూవీ లకు దర్శకత్వం వహించి జామ్స్ కెమెరన్ ప్రపంచవ్యాప్తంగా దర్శకుడిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే చాలా సంవత్సరాల క్రితం ఈ క్రేజీ దర్శకుడు అవతార్ మూవీకి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ మూవీ ఇండియాలో కూడా భారీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించింది. అలా ప్రపంచ వ్యాప్తంగా భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన అవతార్ మూవీ కి సీక్వెల్ గా జామ్స్ కెమెరన్ "అవతార్ ది వే ఆఫ్ వాటర్" అనే మూవీ ని తెరకెక్కించాడు  ఈ మూవీ ని ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 16 వ తేదీన విడుదల చేశారు. ఈ మూవీ పై మొదటి నుండి ఇండియన్ సినీ ప్రేమికుల కూడా భారీ అంచనాలు పెట్టుకోవడంతో ఈ మూవీ కి ఇండియాలో కూడా అద్భుతమైన ఓపెనింగ్ లభించాయి. ఈ సినిమా విడుదల ఇప్పటికే చాలా రోజులు అవుతున్న ఇప్పటికి కూడా ఈ మూవీ కి ఇండియాలో స్టడీగా కలెక్షన్ లు వస్తున్నాయి. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ ఇండియాలో ఒక సరికొత్త రికార్డ్ ను నమోదు చేసుకుంది. ఈ

 మూవీ ఇండియాలో ఇప్పటివరకు ఏ హాలీవుడ్ మూవీ కూడా వసూలు చేయని కలెక్షన్ లను వసూలు చేసింది. ఇప్పటివరకు ఈ సినిమా ఇండియాలో 454 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇదివరకు అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా ఇండియాలో టాప్ పొజిషన్ లో ఉంది. ఈ సినిమా 438 కోట్ల గ్రాస్ కలెక్షన్ ఇండియాలో చేసింది. ప్రస్తుతం అవతార్ ది వే ఆఫ్ వాటర్ సినిమా ఇండియాలో నెంబర్ వన్ గ్రాస్ హాలీవుడ్ మూవీ గా కొనసాగుతుంది. ఇప్పటికి కూడా ఈ సినిమాకు ఇండియాలో కలెక్షన్ లు అద్భుతంగా లభిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: